చాన్నాళ్ళకు మీడియా ముందుకు వచ్చిన టీడీపీ మాజీ మంత్రి…!

17నెలల్లో జగన్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేసిందని టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో బీసీల అభివృద్ధి, అభ్యున్నతి కాగితాలకే పరిమితమైంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. నామినేటెడ్ పదవులు సహ, స్వయంసహాయక రుణాల్లో కూడా వైసీపీ ప్రభుత్వం బలహీనవర్గాలను దారుణంగా వంచించింది అని విమర్శించారు. రాష్ట్రంలో దాదాపు 2.50కోట్ల మంది బీసీలుంటే, జగన్ ప్రభుత్వం నవరత్నాల కింద కేవలం 4లక్షల 37వేలమందికి మాత్రమే న్యాయం చేసింది అని అన్నారు.police arrested ex minister kollu ravindra

గత ప్రభుత్వం బీసీలకు అమలుచేసిన ఆదరణ పథకాన్ని జగన్ రద్దుచేశారన్నారు. పథకం కింద తమవాటాగా చేతి, కులవృత్తులవారు చెల్లించిన రూ.47కోట్లను తిరిగివ్వకుండా, గతప్రభుత్వం కేటాయించిన 300రకాల పనిముట్లను వారికి అందచేయకుండా జగన్ ప్రభుత్వం వాటిని మూలనపడేసిందని విమర్శించారు. ఒక హత్య కేసులు అరెస్ట్ అయిన తర్వాత కొల్లు రవీంద్ర మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. ఆయన ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు.