అయ్యా లోకేషు గారూ, ట్విట్టర్ గడప దాటి రండి సార్…!

-

తెలుగుదేశం పార్టీలో గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వాళ్ళల్లో, ఎమ్మెల్యే సీట్లు వచ్చిన వారిలో చాలా మంది ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళే. చంద్రబాబు రాజకీయ వ్యూహాలు సిద్దం చేయిస్తుంది కూడా వారితోనే. ఎప్పుడో పుట్టిన పార్టీకి ఎప్పుడో వచ్చిన నేతలు మినహా యువనేతలు అనే వారు లేకుండా పోయారు. ఉన్న యువనేతలను చినబాబు, మాజీ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఇబ్బంది పెట్టారు.

అందుకే ఫాలోయింగ్ ఉన్న దేవినేని అవినాష్ లాంటి వారు చాలు ఇక అన్నట్టు వ్యవహరించి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక సోషల్ మీడియాలో మినహా లోకేష్ పెద్దగా ప్రజా పోరాటాలు చేసింది అంటూ ఏమీ లేదు. రాజకీయంగా యువ నాయకత్వం ఆ పార్టీకి అవసరం. బలపడటం అనేది చాలా కీలకం. కాని ఇప్పుడు లోకేష్ మాత్రం ఎంత సేపు ట్విట్టర్ లో విమర్శలు చేయడం, వైసీపీ కార్యకర్తల తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టడం,

వారికి కౌంటర్లు ఇవ్వడం వంటివి చేస్తున్నారు. దీనితో టీడీపీ కార్యకర్తలకు మంచి వినోదం వస్తుంది. సోషల్ మీడియా అనేది ఏ పార్టీకి అయినా అవసరమే. అంతే గాని అదే కీలకం మాత్రం ఎప్పటికి అవదు. సోషల్ మీడియా యువతను కొంత వరకే ఆకట్టుకుంటుంది. మూడ్ ని ఏ విధంగా అయినా మార్చేస్తుంది. టీడీపీ సోషల్ మీడియా బలహీనంగా ఉంది కాబట్టి దాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది.

అంతే గాని లోకేష్ లాంటి కీలక నేత దాంట్లో సమయం మొత్తం వేస్ట్ చేయడం అనవసరం. అది కూడా ట్విట్టర్ లో ఎక్కువ సమయం కేటాయిస్తున్నాయి. జమిలి ఎన్నికలు వస్తే అయన ఎక్కడ పోటీ చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి. రాజకీయంగా ఆ పార్టీకి ఇప్పుడు జవసత్వాలు చాలా అవసరం. జవసత్వాలు నింపే బాధ్యత యువనేత లోకేష్ కి ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో సమయం వృధా చేసుకోవడం అనేది సరైన విధానం కాదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news