టిడిపి-జనసేన మధ్య పొత్తు ఇంకా అధికారికంగా సెట్ కాలేదు..కానీ ఈ లోపే రెండు పార్టీల విభేదాలు మొదలయ్యాయి. ఇప్పటినుంచే సీట్ల కోసం పంచాయితీలు నడుస్తున్నాయి. సీటు తమకంటే తమకని పోటీ పడుతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో సీట్లలో కోసం పోటీ ఎక్కువ ఉంది. మామూలుగా చూసుకుంటే జనసేనకు ఒంటరిగా పోటీ చేస్తే కనీసం 10 లోపు సీట్లు గెలుచుకోగలదు..కానీ 30 పైనే సీట్లలో గెలుపోటములని తారుమారు చేయగలదు. ఆ ప్రభావం టిడిపిపై పడుతుంది. అందుకే టిడిపి..జనసేనతో కలిసి ముందుకెళ్లాలని చూస్తుంది.
జనసేన సైతం టిడిపితో కలిస్తే కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు అని చూస్తుంది. అయితే పొత్తు వల్ల జనసేనకు లాభం..ఎందుకంటే సీట్లు త్యాగం చేయాల్సింది టిడిపినే. జనసేనకు ఆ ఇబ్బంది లేదు..ఎందుకంటే రాష్ట్రంలో జనసేనకు పెద్దగా బలం లేదు. కానీ అన్నీ సీట్లలో బలం ఉన్న టిడిపి..ఇప్పుడు జనసేన కోసం ఏ ఏ సీట్లు త్యాగం చేస్తుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. కేవలం గత ఎన్నికల్లో జనసేనకు రెండో స్థానం వచ్చిన సీట్లు తప్ప మిగిలిన సీట్లని వదులుకోవడానికి టిడిపి సిద్ధంగా లేదు.
భీమవరం, గాజువాక, నరసాపురం సీట్లలో రెండో ప్లేస్ రాగా, రాజోలు సీటు గెలుచుకుంది. ఇప్పుడు పవన్ ఎక్కడ పోటీ చేసిన ఆ సీటు టిడిపి వదులుకుంటుంది. అటు రాజోలు, నరసాపురం కూడా వదులుకుంటుంది. కానీ మిగిలిన సీట్లు వదులుకోవడానికి సిద్ధంగా లేదు. జనసేన బలంగా ఆశిస్తున్న తాడేపల్లిగూడెం, కొత్తపేట, అమలాపురం, రాజానగరం, పిఠాపురం, భీమిలి, కాకినాడ రూరల్, సిటీ, రాజమండ్రి రూరల్, అమలాపురం, పెడన, అవనిగడ్డ, కైకలూరు…ఇలా చూసుకుంటే జనసేన ఆశిస్తున్న సీట్లని టిడిపి వదులుకోవడానికి రెడీగా లేదు.
ఒకవేళ పొత్తులో ఆయా సీట్లు జనసేనకు ఇచ్చిన..అక్కడ తమ్ముళ్ళ సహకారం ఉండేలా లేదు. ఓట్లు బదిలీ కూడా జరగదు. దాని వల్ల జనసేనకే నష్టం.