Korutla Death Mystery : కోరుట్ల టెక్కీ దీప్తి కేసులో బిగ్‌ ట్విస్ట్‌ !

-

Korutla Death Mystery : కోరుట్ల టెక్కీ దీప్తి కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తన అక్క దీప్తిని తాను చంపలేదు అంటూ తమ్ముడు సాయికి వాయిస్ మెసేజ్ పంపింది చెల్లెలు చందన. దీప్తి శరీరం పై గాయాలతో పాటు ఆమె ఎడమ చేయి విరిగడంతో హత్య కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. మరో వైపు తమ్ముడు సాయి కి వాయిస్ మెసేజ్ పంపింది చందన. అరేయ్ సాయి నేను చందక్కనురా, నిజమెంటో చెప్పాలారా. దీప్తిక్క నేను తాగుదామనుకున్నాం. కానీ, నేను తాగలేదు. అక్కనే తాగింది. నేను నా ఫ్రెండ్ చేత తెప్పించా అంటూ సాయికి వివరించింది చందన.

అది నేను ఒప్పుకుంటా. కానీ, అక్కనే తాగింది. తాగిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ను పిలుస్తా అంది. నేను వద్దన్నా.. అయినా పిలుస్తా అంటే చివరికి నీ ఇష్టం సరే అన్నా.నేను ఇంట్లోంచి వెళ్లిపోదాం అనుకున్నాం. అది నిజం. అక్కకి చెప్పి వెళ్లిపోదాం అనుకున్నాం. అక్క హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. ఫోన్ మాట్లాడి.. సోఫాలో పడుకుంది. రెండుసార్లు లేపాను. సరే పడుకుందని డిస్టర్బ్ చేయొద్దని వెళ్లిపోయా. ఛాన్స్ దొరికిందని వెళ్లిపోయిన. నా తప్పేం లేదు సాయి. నాకు అక్కను చంపే ఉద్దేశం లేదు.. నన్ను నమ్ము సాయి, నా తప్పేం లేదు ప్లీజ్ నమ్మురా అంటూ వాయిస్‌ మేసేజ్‌ పెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version