కౌలు రైతులతో పాటు దేవాదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న సాగుదారులతో కలిపి రైతులందరికీ అందిస్తున్న వైఎస్సార్ రైతు భరోసా పథకం నిధుల విడుదల కార్యక్రమం రేపటికి వాయిదా పడింది. ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ 1.46 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 109.74 కోట్లు జమ చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రోగ్రాం వాయిదా పడినట్లు ఉన్నతాధికారులు కాసేపటి క్రితం ప్రకటించారు.
వాయిదాకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. వైఎస్ఆర్ భరోసా పిఎం కిసాన్ పథకం 2023 – 24 లో భాగంగా రైతులకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. రైతులకు ఆర్థిక చేయూత అందించడానికి 15 అక్టోబర్ 2019 నుండి వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్నారు. రేపు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాలకు నేరుగా సాయాన్ని జమ చేస్తారు.