టీడీపీ మేనిఫెస్టో: మీ భవిష్యత్ – నా బాధ్యత

-

టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు చదివి వినిపించారు. అంతకుముందు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకొని మేనిఫెస్టోకు పూజలు చేయించి ఉండవల్లి ప్రజావేదికలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న అనంతరం మేనిఫెస్టోను విడుదల చేశారు.

ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ఆకర్షించడం ప్రారంభించాయి. ఇప్పటికే వైఎసార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఉగాది సందర్భంగా ప్రకటించింది. తాజాగా టీడీపీ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోను ఉగాది కానుకగా విడుదల చేసింది.

ఐదేళ్ల పాలనను చూసి తమకు మరొకసారి అవకాశం ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరుతున్నారు. మీ భవిష్యత్ – నా బాధ్యత అనే నినాదంతో ఆయన ముందుకెళ్తున్నారు.

టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు చదివి వినిపించారు. అంతకుముందు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకొని మేనిఫెస్టోకు పూజలు చేయించి ఉండవల్లి ప్రజావేదికలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న అనంతరం మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో పేరు కూడా మీ భవిష్యత్ – నా బాధ్యత అని పేరు పెట్టారు. టీడీపీ మేనిఫెస్టోలో రైతులు, యువత, పేదలు, మహిళలకు పెద్ద పీట వేశారు.

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

రైతులు, కౌలు రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం
వృద్ధాప్య పించన్‌దారుల అర్హత వయసు తగ్గింపు.. 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు
డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పథకం కొనసాగింపు
ఉచితంగా ఉన్నత విద్య
ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షలకు పెంపు
చంద్రన బీమా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు
ప్రైవేటు రంగంలో యువతకు ఉద్యోగ కల్పన
ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం
పెళ్లి కానుక లక్ష రూపాయలకు పెంపు
ఏపీలోని ప్రతి ఎకరాకు నీళ్లందించడం
రైతులందరికీ ఉచితంగా పంటల బీమా పథకం
రైతులకు పగటి పూట 12 గంటల పాటు ఉచిత కరెంట్
వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
రైతులకు లాభసాటి ధరలు లభించడం కోసం వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం
ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజలకు అవసరమైన తాజా కూరగాయలు, పండ్ల సరఫరాకు ప్రత్యేక చర్యలు
రైతు ఉత్పత్తులకు నాణ్యమైన ధరలు లభించేలా చర్యలు
నిరుద్యోగ భృతిని పెంపు.. రెండు వేల నుంచి 3 వేలకు పెంపు.
ఇంటర్ పాసైతే చాలు నిరుద్యోగ బృతి వర్తింపు
ఇంటర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు
హెల్త్ టూరిజం అభివృద్ధి
విశాఖలో అతి పెద్ద డేటా సెంటర్
తిరుపతిలో ఎలక్ట్రానిక్ క్లస్టర్
పెగా టెక్స్‌టైల్ ప్లాంట్లలో 3 లక్షల ఉద్యోగాలు
మానసిక వికలాంగులకు 3 వేల పింఛను
10 లక్షలలోపు పెట్టుబడి ఉంటే వడ్డీ లేని రుణాలు
100 కోట్లతో ఇన్నోవేటివ్ ఫండ్
ఇన్నోవేషన్ హబ్‌గా రాజమహేంద్రవరం, ఏలూరు, తిరుపతి
గ్రామాల్లో 2 వేల జనాబా ఉంటే భూగర్భ డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, ప్రతి ఇంటికి 70 లీటర్ల తాగు నీరు
100 శాతం అక్షరాస్యత సాధన దిశగా కృషి

Read more RELATED
Recommended to you

Exit mobile version