విజయవాడలో తెలుగుదేశం పార్టీ నేతలు ఈ మధ్య కాలంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ విజయవాడ లో ఇప్పుడు బలహీనంగా కనబడుతుంది. మొన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సమస్యలు లేవని భావించినా పార్టీలో ఉన్న కీలక నేతలు ముగ్గురు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఒకరకంగా ఆందోళన వ్యక్తం చేసింది.
అయితే ఇప్పుడు నుంచి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ ఐన ఒక పోస్ట్ ఆయనను బాగా ఇబ్బంది పెట్టింది. దీనితో పోస్ట్ పెట్టిన సదరు వ్యక్తికి కూడా బుద్ధ వెంకన్న ఫోన్ చేసి మాట్లాడారు. అయితే ఇప్పుడు విభేదాలకు తానే కారణమని అందరూ విమర్శించడంతో బుద్ధ వెంకన్న మనస్తాపం చెందినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలో పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఏ పార్టీలో చేరకుండా ఆయన ఎమ్మెల్సీగా ఉండే అవకాశం ఉందని ఒకవేళ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవికి కూడా ఆయన రాజీనామా చేసే అవకాశాలు కూడా ఉండవచ్చు అని అంటున్నారు. ఇప్పటికే ఆయన పార్టీలో ఉన్న తన సన్నిహితులతో చర్చలు జరిపారని అయితే వాళ్లు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవద్దని కొంతకాలం ఆగిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చునని సూచించినట్లుగా టిడిపి వర్గాలు అంటున్నాయి.