ప్రజా సమస్యల పరిష్కారానికే ధరణి పోర్టల్ రద్దు : మంత్రి పొంగులేటి

-

భేషజాలకు పోయి ధరణి ని మార్చడం లేదని.. ప్రజా సమస్యల పరిష్కారానికే ధరణి పోర్టల్ రద్దు చేస్తాన్నామని  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల దాదాపు 4 నెలలు రిజిస్ట్రేషన్లు జరగలేదన్నారు. అసెంబ్లీలో భూ భారతి బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం పొంగులేటి మాట్లాడారు. ధరణితో అనేక మంది ఇబ్బందులు పడిన మాట వాస్తవం అని తెలిపారు.

ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో వేస్తామని హామీ ఇచ్చాం. ఇప్పుడు వేస్తున్నాం. ధరణీ స్థానంలో భూ భారతి తీసుకొస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్  ఎమ్మెల్యే హరీశ్ రావు లిఖిత పూర్వకంగా సూచించిన అంశాలను ఇందులో పొందుపరిచామని తెలిపారు. ముసాయిదా బిల్లును 40 రోజులు వెబ్ సైట్ లో ఉంచామని.. ఎమ్మెల్యేలు, మేధావులు ఇచ్చిన అంశాలను డ్రాప్ట్ లో పెట్టాం. రాష్ట్రంలోని 33 కలెక్టరేట్ లో ఒక రోజు చర్చ కూడా నిర్వహించినట్టు తెలిపారు. 18 రాష్ట్రాల్లో ఆర్ఓఆర్ చట్టాలను పరిశీలించిన తరువాత భూ భారతి తీసుకొచ్చామని తెలిపారు. ప్రతీ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తాం.. భూ వివాదాలపై అప్పీలు కు ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 33 మాడ్యూల్స్ తో ఉన్న దానిని 6 మాడ్యూల్స్ తో పున: ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు మంత్రి పొంగులేటి.

Read more RELATED
Recommended to you

Latest news