బాబు తగ్గేదేలే…సొంత నేతలకు ఊహించని షాకులు ఇస్తున్నారుగా!

-

తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి అధినేత చంద్రబాబు ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఇప్పటికే గత ఎన్నికల ఘోర పరాభవం నుంచి పార్టీ బయటపడలేకపోతుంది. ఇప్పటికీ రెండున్నర ఏళ్ల సమయం అయినా సరే టీడీపీ బలపడే పరిస్తితి కనిపించడం లేదు. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్తితి మరీ దారుణంగా ఉంది. అసలు టీడీపీ ఉందా? అనే పరిస్తితి కనబడుతుంది.

chandrababu naiduదీంతో బాబు చూస్తూ ఉండలేకపోతున్నారు. ఇప్పటికే నేతలకు చాలా సమయం ఇచ్చారు. అయినా సరే చాలామంది నేతలు ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడంలో విఫలమయ్యారు. దీంతో వారిని అలాగే కంటిన్యూ చేస్తే పార్టీకే నష్టమని, ఇంకా మొహమాటం పడుతూ చూస్తూ ఉంటే ఇబ్బంది అని చెప్పి…బాబు డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. పని చేయని నాయకులని ఏ మాత్రం మొహమాటం లేకుండా పక్కనబెట్టేస్తున్నారు. ఇటీవల పలు నియోజకవర్గాల్లో నాయకులని పక్కనబెట్టి కొత్తవారిని ఇంచార్జ్‌లుగా పెట్టిన విషయం తెలిసిందే.

పామర్రు, మాడుగుల, సాలూరు, నరసాపురం లాంటి నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలని సైడ్ చేసి, వేరే నాయకులకు బాధ్యతలు అప్పగించారు. తాజాగా కూడా బాబు…సీనియర్ నేత కే‌ఈ కృష్ణమూర్తి ఫ్యామిలీకి భారీ షాక్ ఇచ్చారు. కర్నూలు జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కే‌ఈ ఫ్యామిలీ చేతిలో రెండు నియోజకావర్గాలు ఉన్నాయి. డోన్, పత్తికొండ నియోజకవర్గాలు కే‌ఈ ఫ్యామిలీ చేతిలో ఉన్నాయి.

గత ఎన్నికల్లో పత్తికొండ నుంచి కే‌ఈ వారసుడు శ్యామ్ పోటీ చేసి ఓడిపోగా, డోన్ నుంచి కే‌ఈ సోదరుడు ప్రతాప్ పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక కే‌ఈ ఫ్యామిలీ టీడీపీలో యాక్టివ్ గా లేదు. అటు నియోజకవర్గాలని గాలికొదిలేసింది. మధ్యలో ప్రతాప్‌ని పక్కనబెట్టి డోన్ బాధ్యతలు కే‌ఈ మరో సోదరుడు ప్రభాకర్‌కు అప్పగించారు. ఆయన కూడా అక్కడ యాక్టివ్ గా పనిచేయడం లేదు. దీంతో తాజాగా బాబు…డోన్‌లో కే‌ఈ ఫ్యామిలీని సైడ్ చేసి మన్నె సుబ్బారెడ్డిని ఇంచార్జిగా పెట్టారు. ఇక పత్తికొండ మాత్రమే కే‌ఈ ఫ్యామిలీ చేతిలో ఉంది. మొత్తానికి పార్టీ కోసం పనిచేయకపోతే ఎవరినైనా సైడ్ చేయడంలో తగ్గేదేలే అంటున్నారు బాబు.

Read more RELATED
Recommended to you

Latest news