టీడీపీ బాగోతం మరోసారి బట్టబయలు….డీబీటీ లబ్ధిదారులతో చెలగాటం

-

58 నెలల పాలన. ప్రత్యక్షంగా లబ్ధిదారుల ఖాతాలోకే సంక్షేమ ఫలాలు. అవ్వాతాతలకు పెన్షన్ ఇంటి వద్దకే వచ్చింది. కానీ ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే వీటన్నింటికి బ్రేక్ పడింది. కారణం చంద్రబాబులోని కుట్రకోణం.ఇన్నాళ్లూ పేదలకు కష్టం రాకుండా చూసిన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమయ్యారాయన.ఎదో ఒక విధంగా లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడమే చంద్రబాబు ఉద్దేశ్యం. ఏకంగా ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదులు చేయడం ద్వారా ఆయన లబ్ధిదారులపై కక్ష తీర్చుకుంటున్నారు.ఐదేళ్లుగా అమలవుతున్న పధకాలే అయినా వాటికీ ఎన్నికల కోడ్ పేరుతో మోకాలడ్డారు.ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టిన పథకాలు కాదు అవి.అయినా చంద్రబాబు తన కుట్రలను బయటపెడుతున్నారు.

వైఎస్సార్ ఆసరా, విద్యా దీవెన, ఇన్ పుట్ సబ్సిడీ, చేయూత, ఈబీసీ నేస్తం.. వంటి పథకాల చెల్లింపులు చివరి దశలో ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయాయి. కోడ్ కారణంగా అని చెప్పడం కంటే టీడీపీ కారణంగా అని చెప్పడం కరెక్ట్.అయితే పథకాల విషయమై అధికారులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరారు. అక్కడ కూడా అనుమతి రాకుండా టీడీపీ అడ్డుపుల్లలు వేస్తోంది.గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లోనే నిధులు కేటాయించి, ఈ ఏడాది మార్చిలో ఎన్నికల కోడ్ రాకముందే డీబీటీ పథకాలకు బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు సీఎం జగన్. దాదా70నుంచి 80శాతం మందికి కోడ్ అమలులోకి రాకముందే బ్యాంక్ అకౌంట్లలో నిధులు జమ అయ్యాయి. మిగతా 20నుంచి 30శాతం చెల్లింపులు కోడ్ అమలులోకి రావడంతో నిలిచిపోయాయి.

ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందు నుంచీ అమలవుతున్న పథకాలకు, బడ్జెట్ లో నిధులు కేటాయించిన వాటికి.. కోడ్ అడ్డు రాదు. కొత్త లబ్ధిదారులను మాత్రం ఎంపిక చేయడం కుదరదని ఎన్నికల నియమావళి చెబుతోంది.పాత లబ్ధిదారులకు కూడా నిధులు జమ కాకుండా అడ్డుకుంటున్నారు ఇప్పుడు.లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిధుల విడుదలకు అనుమతి కావాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. కానీ అనుమతులు రాలేదు, కారణం టీడీపీ అని తేలిపోయింది. ఇప్పటికే సామాజిక పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం చేసి లబ్ధిదారుల ఉసురు పోసుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు డీబీటీ పథకాలకు కూడా మోకాలడ్డి వారిని అవస్థల పాలు చేస్తున్నారు.నవతరం పార్టీ తరఫున పరోక్షంగా కోర్టులో అప్పీల్ వేశారు.తమకు ఫిర్యాదులు వచ్చినందునే పథకాలను నిలిపేశామని ఈసీ చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news