ఏదేమయినప్పటికీ టీడీపీని ఉత్తరాంధ్ర నాయకులు టార్గెట్ చేస్తున్న విధంగా కృష్ణా, గుంటూరు నాయకులు చేయలేకపోతున్నారు. వాస్తవాలే మాట్లాడండి గణాంకాలు చెప్పండి అని జగన్ అంటూ ఉన్నా పాపం వాళ్లు అవి కాకుండా కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితం అయి మాట్లాడి పరువు పోగొట్టుకుంటున్నారు. కానీ జగన్ దగ్గర ఉన్న ఉత్తరాంధ్ర నాయకులు కాస్త పరిణితితో ఉన్నారు. వాళ్లు మాత్రం టీడీపీకి కళ్లజోడు ప్రాబ్లం ఏమయినా ఉందా మాతో రండి సరి చేయిస్తాం అని చెప్పి, కళ్లను పెద్దవి చేసి చూడండి మీకు అన్ని నిజాలే తెలుస్తాయి అని చెప్పి కౌంటర్లు ఇస్తూ, జగన్ కు అనుగుణంగా కాస్తో కూస్తో సమర్థనీయం అనుకునే ధోరణిలో మాట్లాడుతున్నారు.
అతిగా పొగడకండి.. మీ పుణ్యం ఉంటుందని జగన్ చెప్పినా జోగి రమేశ్ వినరు.. అతిగా తిట్టకండి వాటి వల్ల నో యూజ్ అని జగన్ చెప్పినా కొడాలి నాని వినరు..ఈ ఇద్దరి అతి కారణంగానే వైసీపీ ఎప్పటికప్పుడు వివాదాల్లో ఇరుక్కుపోతోంది. ఆ విధంగా ఆ ఇద్దరు కృష్ణా జిల్లా నాయకులు తరుచూ మీడియా ఎదుట ఇరుక్కుపోతున్నారు కానీ తెలివైన మాటలు చెప్పడంలో.. ఉత్తరాంధ్ర నాయకులు బలంగానే ఉన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ ఏం చేశారో చెబుతున్నారే కానీ భజన చేయడం లేదు. ఆ మాటకు వస్తే జగన్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నదే ఇది. తన సొంత మీడియా అయిన సాక్షికి కూడా చెబుతున్నది కూడా ఇదే ! భజన కాదు భక్తి కాదు వాస్తవాలు రాయండి అని ఎన్నోసార్లు అక్కడి జర్నలిస్టులకు చెప్పి చూశారాయన. బట్ నో యూజ్ ..
ఉన్నవి రెండు కళ్లు అనేక కలలు.. రంగుల కలలు అని రాయాలి.. పొయెటిక్ గా అయితే ఇలానే రాయాలి.. పాపం! మన రాజకీయ నాయకులు కూడా అప్పుడప్పుడూ పొయెట్రీ చెబుతుంటారుగా ! ఆ విధంగా కళ్లుంటే చూడాలి చెవులుంటే వినాలి..నోరుంటే మాట్లాడాలి అనే విధంగానే ఉంటూ, కాస్తయినా వాస్తవాలకు తూగే విధంగా వివరంగా కొన్ని మాటలు చెబితే బాగుంటుంది. బొత్తిగా ప్రశంసలు లేని ప్రసంగాలు చూడలేం కానీ మరీ! అతి చేసి భజన చేయాల్సిన పని అయితే లేదు. ఆ మాటకు వస్తే ఉత్తరాంధ్ర లీడర్ల కన్నా కృష్ణా జిల్లా లీడర్లు కాస్త ఎక్కువగానే జగన్ పై ప్రశంసల వానలు కురిపిస్తారు. కానీ వాస్తవాలు మాత్రం తెలుసుకోవాలి అని టీడీపీకి బలంగా చెప్పరు గాక చెప్పరు. కానీ ఉత్తరాంధ్ర లీడర్లు ఎప్పటికప్పుడు టీడీపీని ఉద్దేశించి మీకు కళ్లుంటే చూడండి.. లేదంటే ఊరుకోండి అని మాత్రం వార్నింగులు బాగానే ఇస్తున్నారు. మరీ! జోగి రమేశ్ మాదిరిగా తమ ,తమ ప్రసంగాలనో, ప్రవచనాలనో జగన్ ను అతి కీర్తించేందుకు మాత్రం వాడుకోవడం లేదు. కనుక కళ్లుంటే చూడండి మేమేం చేస్తున్నామో చూడండి అని మాత్రమే చెప్పి, వాస్తవాలు వివరించే ప్రయత్నం ఒకటి విపరీతంగా చేస్తున్నారు. పథకాలు అందడం లేదా చెప్పండి. ఒక్కసారి బ్యాంకు పాసు పుస్తకాలు తీసుకుని రండి మేమే మిమ్మల్ని బ్యాంకు దగ్గరకు తీసుకువెళ్లి ప్రింటౌట్లు తీయించి మరీ! ఎవరికి ఎంత సొమ్ము అందిందో కూడా చెబుతాం అని పదే పదే చెబుతున్నారు. అంటే వాస్తవాలు వివరించే పని కృష్ణా జిల్లా నాయకుల కన్నా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులే కాస్త ఎక్కువగా చేస్తున్నారు అన్నది సుస్పష్టం.