బీజేపీలో గ్రేటర్ రేపిన చిచ్చు..ఆ నేతల పై వేటు తప్పదా

-

బీజేపీ లో గ్రేటర్ ఉపఎన్నిక లింగోజిగూడ ఎపిసోడ్ లొల్లి కొనసాగుతుంది.. ఆ డివిజన్ ఏకగ్రీవం చేయాలనే ఆలోచన ఎవరిది..కేటీఆర్ ని ఎందుకు కలవాల్సి వచ్చింది అనే దానిపై పార్టీ లో జోరుగా చర్చ జరుగుతోంది..ఒక్క డివిజన్ కోసం టీఆర్ఎస్ నేతలను ఎందుకు కలవాల్సి వచ్చింది.. వెనక ముందు ఆలోచించకుండా ఎలా ప్రగతి భవన్ కు వెళ్తారు అని పార్టీ లోని ఓ వర్గం ప్రశ్నిస్తుంది నిజాల్ని నిగ్గుతేల్చి చర్యలు తీసుకోవాలని బీజేపీ పెద్దలు డిసైడ్ అయ్యారు.

బీజేపీ లో లింగోజిగూడ ప్రకంపనలు కొనసాగుతున్నాయి.. ఉప ఎన్నిక ఏకగ్రీవం పేరుతో కేటీఆర్ ని ఎందుకు కలవాల్సి వచ్చింది.. దీని వెనుక ఎవరున్నారు అనే దాని పై విచారణ ప్రారంభం అయింది..ఈ విషయం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఆగ్రహం తో ఉన్నారు. అసలు సంగతి ని తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది పార్టీ. ఈ కమిటీ విచారణ ప్రారంభించింది… ఆ రోజు కేటీఆర్ ని కలిసిన బృందం లో ఉన్న వారితో విడివిడిగా మాట్లాడుతుంది… ఆ రోజు కేటీఆర్ ని కలవడానికి ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాల పై ఆరా తీస్తుంది.

కేటీఆర్ ని కలిసిన వారిలో బీజేపీ సీనియర్ లు రామ చందర్ రావు, పేరాల శేఖర్ రావు లతో పాటు పలువురు కార్పొరేటర్ లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డిని కూడా కమిటీ విచారించింది…అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రోద్బలంతో నే ఇదంతా జరిగింది అనే విషయాన్ని వారు కమిటీ ముందు చెప్పినట్టు సమాచారం..ఆయన ఎందుకు వెంబడి పడుతున్నారో కనీసం ఆలోచించారా అని వారిని కమిటీ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. రామచందర్ రావ్ ,మిగతా నేతలు బీజేపీలో ఇతర ముఖ్య నేతల అనుమతి లేకుండానే పోయి కలిశారా లేక వెనక ఎవరన్నా ఉన్నారా అనేది తెలాలని అంటున్నారు… ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఆలోచించాలి కదా అని అంటున్నారు..

ఇక కేటీఆర్ తో బీజేపీ నేతలు కలిసినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ పై కూడా బీజేపీ లో చర్చ జరుగుతోంది.. ఆయన మోడీ ని, బండి సంజయ్ ని అంత ముంది ముందు విమర్శిస్తూ మాట్లాడుతుంటే ఎందుకు నిలవరించలేక పోయారని పార్టీ లోని ముఖ్యనేతలు మండిపడుతున్నారు… కేటీఆర్ బీజేపీ లోని కొందరు నేతలకి అనుకూలంగా మరి కొందరిని విమర్శిస్తూ ప్రధానంగా బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు అని తెలియడంతో కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందో.. ఎవరి పైన చర్యలు తీసుకోవాలని సిపార్సు చేస్తుందో అన్న టెన్షన్ ఆ నేతల్లో మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news