తెలంగాణా బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట…!

-

ఒక లక్షా 84, 914 కోట్లతో తెలంగాణా బడ్జెట్ ని అంచనా వేశామని చెప్పారు. రైతు రుణమాఫీ 6225 కోట్లు. రైతు బీమా… ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తున్నామని అన్నారు. రైతు బీమాకు 1141 కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు. 25 వేల లోపు రుణాలు ఉన్న రైతులు అందరికి ఒకేసారి రుణమాఫీ చేస్తామని అన్నారు. పాడి పరిశ్రమ ను ప్రోత్సహించే ఉద్దేశంతో లీటర్ కి 4 రూపాయలు ప్రోత్సాహం అందిస్తున్నామని అన్నారు.

రైతులకు రుణమాఫీకి చెక్కులు ఎమ్మెల్యేలు స్వయంగా అందించారు. తెలంగాణా పాడి రైతులకు వంద కోట్లు ఇస్తున్నామని అన్నారు. విజయ డైరీని లాభాల్లోకి తీసుకొచ్చామని, సమైఖ్య పాలనలో విజయ డైరీని స్వార్ధం కోసం నాశనం చేసారని హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చెయ్యాలని కెసిఆర్ సంకల్పించారు అంటూ హరీష్ రావు పేర్కొన్నారు. అందుకే వేగంగా పూర్తి చేసామని అన్నారు.

ఇదే స్ఫూర్తి తో మిగిలిన ప్రాజెక్ట్ లను కూడా పూర్తి చేస్తామని పాలమూరు ని కూడా పూర్తి చేస్తామని అన్నారు. కొద్ది రోజుల్లోనే మిగిలిన ప్రాజెక్ట్ లు కూడా పూర్తి చేస్తామని హరీష్ రావు వివరించారు. కరువు ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి సాగునీటి ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామని అన్నారు హరీష్ రావు. ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే పెండింగ్ ప్రాజెక్ట్ ల మీద దృష్టి పెట్టి పూర్తి చేస్తున్నామని అన్నారు.

దీనితో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని అన్నారు. వలసలు కూడా తగ్గుతున్నాయని. భక్తరామదాసు ప్రాజెక్ట్ ని, పాలమూరు ఎత్తిపోతల పథకం త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. సాగునీటి ప్రాజెక్ట్ ల కోసం 11,054 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని అన్నారు హరీష్. ఉమ్మడి పాలనలో తాగునీటికి దొరకక తెలంగాణా ప్రజలు నానా అవస్థలు పడ్డారని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news