మహిళా దినోత్సవం.. మహేష్ ఎమోషనల్ ట్వీట్

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. అలుపెరగని శ్రమకు, అనంతమైన ప్రేమకు చిహ్నంగా మహిళ నిలుస్తోంది. అలాంటి మహిళకు క్యాలెండర్‌లో ఓ రోజు ఉంది. మహిళ గురించి చెప్పుకోవడానికి, వారి త్యాగాలను గుర్తుకు తెచ్చుకునేందుకు, వారికంటూ ఓ గుర్తింపు ఉందని అందరికీ తెలియజెప్పడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా సెలెబ్రేట్ చేస్తారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉమెన్స్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా నిర్వహిస్తున్నారు. మన టాలీవుడ్ సెలెబ్రిటీస్ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు తన జీవితంలోని ముగ్గురు మహిళల గురించి ప్రస్తావిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. నా జీవితంలోని ముగ్గురు మహిళలు.. వారికి మరింత శక్తి రావాలి.. మిగతా అందరకీ మరింత శక్తి రావాలి.. వెళ్లండి ఈ రోజుకున్న తేడా చూపండి.. హ్యాపీ ఉమెన్స్ డే అంటూ కూతురు సితార, భార్య నమ్రతా, తల్లి ఇందిరా దేవీ ఫోటోలను షేర్ చేశాడు.

ఉమెన్స్ డే సందర్భంగా వకీల్ సాబ్ మొదటి సాంగ్ రిలీజ్ చేశారు. మగువా మగువా అంటూ సాగే పాటను ఈ రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేశారు. మహిళా గొప్పతనాన్ని చాటి చెప్పే ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news