BREAKING : తెలంగాణ ఎమ్మెల్సీకి కరోనా..!

-

తెలంగాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఇప్పటికే ఎంతో మంది ప్రజలతో పాటు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా డిని బారిన పడ్డారు. కాగా, తాజాగా.. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు. అలాగే డ్రైవర్‌కు, ఇద్దరు గన్‌మెన్లకు కూడా కరోనా ‌పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నారదాసు లక్ష్మణ్ కుటుంబం హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, గొంగిడి సునీత దంపతులు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులకు కరోనా సోకింది.

ఇక కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి సైతం కరోనా సోకిన విషయం తెలిసిందే. ఐతే వీరిలో చాలా మంది ఇప్పటికే కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రజా ప్రతినిధులు కూడా కొవిడ్ బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version