తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారయింది. తెలంగాణ మంత్రులుగా 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదివరకు మంత్రులుగా పని చేసిన వాళ్లతో పాటు.. ఈసారి కొత్తవారికి కూడా చాన్స్ లభించింది. ఇవాళ ఉదయం 11.30కు రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. కొత్త మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం సీఎం కేసీఆర్ వాళ్లకు శాఖలు కేటాయిస్తారు.
కొత్త వారిలో ఎమ్మెల్యేలు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ ఉండగా… పాత వారిలో జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు.
కొత్త వారిలో నిరంజన్ రెడ్డి- వనపర్తి ఎమ్మెల్యే కాగా… ఎర్రబెల్లి దయాకర్ రావు – పాలకుర్తి, మల్లారెడ్డి- మేడ్చల్, శ్రీనివాస్ గౌడ్- మహబూబ్ నగర్, ప్రశాంత్ రెడ్డి- బాల్కొండ, కొప్పుల ఈశ్వర్- ధర్మపురి నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
పాతవారిలో జగదీశ్ రెడ్డి- సూర్యాపేట ఎమ్మెల్యే కాగా… తలసాని శ్రీనివాస్ యాదవ్- సనత్ నగర్, ఈటల రాజేందర్- హుజూరాబాద్, ఇంద్రకరణ్ రెడ్డి- నిర్మల్ ఎమ్మెల్యేగా ఉన్నారు.