నగ్మా మీద కన్నేసిన త్రివిక్రం

-

త్రివిక్రం శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం అవుతుంది. డిజే భామ పూజా హెగ్దెని రిపీట్ చేస్తున్న త్రివిక్రం బన్ని తల్లి పాత్రలో ఒకప్పటి హాట్ హీరోయిన్ నగ్మాని తెస్తున్నారట. త్రివిక్రం సినిమాల్లో స్పెషల్ రోల్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

అత్తారింటికి దారేది సినిమాలో నదియా పాత్ర ఎలా క్లిక్ అయ్యిందో తెలిసిందే. అలానే తన ప్రతి సినిమాలో తల్లి, అత్త పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే త్రివిక్రం అల్లు అర్జున్ సినిమాలో తల్లి పాత్రకి నగ్మాని తీసుకోవాలని చూస్తున్నారట. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయట. నగ్మా నుండి రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారట.

టాలీవుడ్ లో స్టార్స్ అందరి సరసన నటించి ఓ ఊపు ఊపేసిన నగ్మా సెకండ్ ఇన్నింగ్స్ లో ఒకటి రెండు సినిమాల్లో అత్త పాత్రలు చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ తన ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని చూస్తున్న నగ్మాకి త్రివిక్రం సినిమా ఎలా కలిసి వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news