రాజకీయాల్లో పదవులు లేనోళ్లని ఎవ్వరూ పట్టించుకోరు.. కనీసం అనుచరులు, అధికారులు కూడా లైట్ తీసుకుంటారు.. దీంతో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పదవి ఉండాలని కోరుకోవడం సహజం.. సీనియర్లు అయితే ప్రభుత్వంలో కీలక పదవులు కావాలని లాబియింగులు చెయ్యడం మామూలే.. ఇదే క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.. సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెరుగుతోందట..
తెలంగాణలో వివిధ మార్గాల ద్వారా 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలతో పాటు.. ఎమ్మెల్యే కోటా, అలాగే గవర్నర్ కోటాలు ఎమ్మెల్సీస్థానాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చెయ్యబోతుంది.. ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీలు మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కే ఛాన్స్ ఉంది.. దీంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానం కోసం సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు ఇచ్చినా.. అందులో ఓడిపోతే రాజకీయభవిష్యత్ కష్టమనే భావనలో పార్టీ నేతలున్నారని ప్రచారం జరుగుతోంది..
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు కోసం చాలా మందే ప్రయత్నాలు చెయ్యాలి కానీ.. అది జరగడం లేదట.. జీవన్ రెడ్డినే మరోసారి బరిలోకి దింపాలని అధిష్టానం భావిస్తున్నా.. ఆయన కూడా విముఖత వ్యక్తం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.. తనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కావాలని అడుగుతున్నారట..
జీవన్ రెడ్డితో పాటు.. హైదరాబాద్ కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేతతోపాటు.. నల్గోండ, మెదక్ కు చెందిన పలువురు సీనియర్లు ఎమ్మెల్సీ స్థానాలను ఆశిస్తున్నారు.. ఎన్నికల్లో పోటీ చేసే స్థోమత తమకు లేదని.. గవర్నర్ కోటా లేదంటే.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారని గాంధీభవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. మరికొందరు సీనియర్లు అయితే.. నేరుగా రాహుల్ గాంధీనే కలిసి.. తమ మనస్సులోని మాట చెబుతున్నారట.. దీంతో ఆ 9 స్థానాలు ఎవరిని వరించబోతున్నాయో చూడాలి..