రేవంత్ రెడ్డి పాలన హిట్టా.. ఫట్టా.. తెలంగాణా ప్రజలు ఏమంటున్నారు..?

-

సీఎంగా..ప్రజా సమస్యలను పరిష్కరించడం ఎంత ముఖ్యమో.. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండటం కూడాఅంతే ముఖ్యం.. అ రెండింటిల్లో సక్సెస్ అయితే.. ఆ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందడం ఖాయం.. గతంలో ఏపీలో రాజశేఖర్ రెడ్డి ప్రజల మన్ననలు పొందారు కాబట్టే.. ఇప్పటికి కూడా ఆయన్ని అందరూ గుండెల్లో పెట్టుకుని కొలుస్తుంటారు.. ప్రజలకు దగ్గరవ్వడం ఎంత కష్టమో..ఒక్కసారి దగ్గరైతే.. దూరమవ్వడం కూడా అంతే కష్టం.. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఓ చర్చ నడుస్తోంది..

సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 250 రోజులు పూర్తయ్యాయి.. ఈ క్రమంలో ఆయన పాలన హిట్ అయిందా..లేక ప్లాప్ అయిందా అనే చర్చ కాంగ్రెస్ పార్టీతో పాటు.. తెలంగాణాలో చర్చలకు దారి తీస్తోంది.. ఈ వ్యవహారంపై ఓ న్యూస్ ఏజన్సీ సర్వే చేయించిందట.. ఈ సర్వేలో కొన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి గుసగుసలు వినిపిస్తున్నాయి.. గ‌త ఏడాది న‌వంబ‌రు-డిసెంబ‌రు మ‌ధ్య కాలంలో కాంగ్రస్ ప్రభుత్వం ఏర్పడింది..

ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చెయ్యడంతో పాటు.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చేరువయ్యారట.. మంత్రులు, ఎమ్మెల్యేలతో నిత్యం టచ్ లో ఉంటూ..అప్పుడుప్పడు ఆయన కూడా ప్రజలతో ఇంట్రాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణాలో రేవంత్ పాలనపై 72 శాతం మంది ప్ర‌జ‌లు సంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్టు స‌ద‌రు స‌ర్వే పేర్కొంది.మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ద్వారా మహిళల్లో ఆదరణ పెరిగిందట..అలాగే విద్యార్థులు, నిరుద్యోగులు కూడా రేవంత్ పాల‌న‌పై సంతృప్తిగానే ఉన్నార‌ని స‌ర్వే వెల్లడించింది.. ఈ సర్వేపై బీఆర్ ఎస్ నేతలు తమదైన శైలిలో విమర్శలు సంధిస్తున్నారు.. ముందుంది ముసళ్ల పండుగ అంటూ కొందరు నేతలు సెటైర్లు పేలుస్తున్నారట.. మరో నాలుగేళ్ల పాలన ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇలాగే ఆదరిస్తారో లేదో కాలమే నిర్ణయించాలి..

Read more RELATED
Recommended to you

Latest news