తెలంగాణ సాధనే లక్ష్యంగా కేసీఆర్…తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇక అనుకున్న విధంగానే కేసీఆర్..తెలంగాణని సాధించగలిగారు…ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా రెండోసారి సీఎంగా కొనసాగుతున్నారు. అయితే పార్టీ పెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్‌లో 10 లక్షల మందితో విజయగర్జన సభ జరపాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించిన విషయం తెలిసిందే. నవంబరు 15న సభ నిర్వహించాలని మొదట అనుకున్నారు.
కానీ అనుహ్యా పరిణామాల మధ్య సభని నవంబర్ 29కు వాయిదా వేశారు. హన్మకొండ జిల్లాలోని దేవన్నపేటలో సభని నిర్వహించాలని టీఆర్ఎస్ నేతలు ఫిక్స్ అయ్యారు. ఇక దీనికి సంబంధించి సభని …అక్కడున్న పొలాల్లో నిర్వహించాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే పంట పొలాలని చదును చేసి అందులో విజయగర్జన సభ పెట్టడానికి టీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. అలాగే పంటకు నష్టపరిహారం చెల్లించడానికి కూడా సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే విజయగర్జన సభకు 130 ఎకరాల భూములను ఇస్తామని స్థానిక వెంచర్ల యజమానులతోపాటు రైతులు ఒప్పుకొన్నారు.
అందుకు తగ్గట్టుగా ఒప్పందాలు చేసుకున్నారు. కానీ కొందరు రైతులు పొలాలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. చేతికొచ్చిన పంటని నాశనం చేసే సభకు ఎలా భూములు ఇస్తామని రైతులు ఫైర్ అవుతున్నారు. పైగా నష్టపరిహారం కూడా సరిగ్గా అందించేలా లేరని, తాము భూములు ఇవ్వమని చెప్పేస్తున్నారు.
పంట పొలాల్లో ‘విజయగర్జన’ సభ నిర్వహించి తమ పొట్టలు కొట్టాలనుకోవడం దుర్మార్గమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… పంట పొలాల్లో సభలు నిర్వహిస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పైగా సభ కోసం భూములు చదును చేస్తే…నెక్స్ట్ పొలాల సరిహద్దులు తెలియవని, అప్పుడు రైతుల మధ్య గొడవలు అవుతాయని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఇక సభకు భూమి ఇవ్వకపోతే ధరణి పోర్టల్ నుంచి భూములు వివరాలు లేకుండా చేస్తామని, మీ భూమిని వేరొకరి పేరుమీద చేస్తామని కొందరు టీఆర్ఎస్ నేతలు, అధికారులు బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా రైతుల ఆవేదన మధ్య టీఆర్ఎస్ విజయగర్జన సభ జరుగుతుందో లేదో చూడాలి.