బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ ప్రభావం ఎంత వరకు పడింది అనే దానిపై స్పష్టత లేదు గాని… ఆయన కారణంగా బిజెపి ఎక్కువ స్థానాలు గెలిచింది అని, జేడియు ఎక్కువ స్థానాల్లో ఓటమి పాలు అయింది అనే విషయం మాత్రం స్పష్టంగా అర్ధమైంది. ఆయన బిజెపికి పరోక్షంగా సహకరిస్తూ జేడియుని ఘోరంగా దెబ్బ కొట్టారు. ఆయన కారణంగా జేడియు మూడో స్థానానికి పడింది.
అయితే నితీష్ కుమార్ సిఎం అయ్యే అవకాశం లేదని ఆయన ముందు నుంచి చెప్పినా సరే నితీష్ మాత్రం సిఎం అవుతున్నారు. అయితే బీహార్ ఎన్నికల్లో తాము ఎక్కువ స్థానాలు గెలవడానికి సహకరించిన ఎల్జెపి అధినేత, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎన్డియేలో ఆయన పార్టీ ప్రభావం తక్కువ. ఆయన తండ్రి రాం విలాస్ పాశ్వాన్ కేంద్ర మంత్రిగా ఉండి మరణించగా ఆ స్థానం చిరాగ్ కి ఇవ్వనున్నారు.