హీరోయిన్ విషయంలో ప్రభుత్వానికి షాక్…!

-

ముంబైలోని కంగనా రనౌత్ బంగ్లా కూల్చివేత పనులను ఆపాలని బొంబాయి హైకోర్టు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) ను ఆదేశించింది. శివసేన నియంత్రణలో ఉన్న బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) ఈ రోజు కంగనాకు చెందిన బాంద్రా బంగ్లాలో అక్రమంగా చేసిన మార్పులను కూల్చి వేశామని అధికారులు పేర్కొన్నారు. బుల్డోజర్లు, జెసిబిలు మరియు ఇతర భారీ పరికరాలతో బిఎంసి హెచ్-వెస్ట్ వార్డ్ అధికారుల బృందం కార్యాలయానికి చేరుకుంది.

బయటి నుండి కూల్చివేత పనులను చేపట్టింది. మంగళవారం (సెప్టెంబర్ 8) నోటీసుకు కంగనా న్యాయవాది రిజ్వాన్ సిద్దిక్ చెప్పిన జవాబుని తిరస్కరించి బిఎంసి కార్యాలయం వెలుపల నోటీసు అతికించిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. కంగనా నేడు హిమాచల్ ప్రదేశ్ నుంచి అక్కడికి చేరుకుంది. ఇలా కూల్చివేతతో అధికారులు స్వాగతం పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news