కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమాల పై మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ మరో సారి మద్దత్తు గా నిలిచాడు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమంలో ఇప్పటి వరకు చాలా మంది చనిపోయారని.. వారిని ఎవరూ పట్టించు కోవడం లేదని అన్నారు. ఎక్కడైన ఒక కుక్క చనిపోయినా.. కొంద మంది ఢిల్లీ నేతలు వాటికి సంఘీభావాలు తెలుపుతున్నారు.
కాని సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం లో చాలా మంది రైతులు చనిపోతే ఈ ఢిల్లీ నేతలు మౌనంగా ఉంటున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఈ పోరాటం లో చాలా మంది రైతులు చనిపోయారు.. కాని ఒక్క తీర్మాణం కూడా చేయాలేదని అన్నారు. తాను మాట్లాడుతున్నది తనను గవర్నర్ చేసిన వారికి వ్యతిరేకంగా అని తెలిసి కూడా రైతుల కు మద్ధత్తు గానే మాట్లాడుతానని అన్నారు. వారు తనను పదవి నుంచి తప్పు కోమ్మని అంటే.. తప్పకుండా తప్పు కుంటానని అన్నారు. అయితే మేఘాలయ గవర్నర్ చాలా రోజుల నుంచి సాగు చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పై పోరాడుతున్న రైతులకు మద్ధత్తు గా నిలుస్తున్నారు.