రేపటి నుంచే నేనే రంగంలోకి దిగుతున్నా.. ఈ సన్యాసి గాళ్ళ అంతు చూస్తా : కెసిఆర్ వార్నింగ్

-

దాదాపు ఏడాది కాలం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులపై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు సీఎం కేసీఆర్. ఎంతలా అంటే అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ తరహాలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నీ టార్గెట్ చేస్తూ తూ.గో చేశారు సీఎం కేసీఆర్.

cm kcr bjp party

ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా.. వ్యవహరించారు. ఇక తానే రేపటి నుంచి రంగంలోకి దిగుతున్న ట్లు చెప్పిన సీఎం కేసీఆర్ .. ఈ కిరికిరి గాళ్లు, తలమాశిన గాళ్లు, ఈ సన్యాసి గాళ్ళు, ఈ చిల్లర గాళ్ళ అంతు చూస్తానని హెచ్చరించారు.

ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డ సీఎం కేసీఆర్..ముఖ్యమంత్రి… మంత్రులు…ప్రజా ప్రతినిదులు దీనిపై ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తామని హెచ్చరించారు. పంజాబ్ ధ్యానం కొని తెలంగాణ ధాన్యం ఎందుకు కొనరు ? అని నిలదీశారు. తెలంగాణ లో పంట పండితే మీ కళ్ళు మండుతున్నాయా ? అని నిప్పులు చెరిగారు సీఎం కెసిఆర్. KRMB అనేది కొత్త డ్రామా ? అని…దమ్ముంటే తెలంగాణ వాటా తేల్చండి ఆని సవాల్ విసిరారు. సుప్రీం కోర్టు లో కేసు విత్ డ్రా చేసుకున్నామని…మాట ప్రకారం ట్రిబ్యునల్ కు రెఫెర్ చేయాలని డిమాండ్ చేశారు. ట్రిబ్యునల్ కి రెఫర్ చేయడానికి ఏడేళ్లు పడుతుందా ? తెలంగాణ కి నీళ్ళు వద్దా ? అని నిప్పులు సిరి గారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news