గ్రేటర్ సైరన్: గ్రేటర్ లెక్క ఇదే

ఇవాళ జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రిటర్నింగ్ అధికారుల ద్వారా రేపు వార్డు సభ్యుల ఎన్నికకు నోటీసు ఇస్తారు. రేపట్నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. గ్రేటర్ లో మొత్తం వోటర్లు 74 లక్షల 4 వేల 286 ఉన్నారు. పురుషులు 38 లక్షల 56 వేల 770 మంది ఉన్నారు. మహిళలు 35 లక్షల 46 వేల 847 మంది ఉన్నారు. ఇతరులు 669 ఉన్నారు.

పోలింగ్ కేంద్రాలు 9248 ఉన్నాయి. గ్రేటర్ లో 150 వార్డులు ఉన్నాయి. ఈసారి బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్ కు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నైజేషన్ తో ఓటర్లను గుర్తింపు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. గ్రేటర్ లో అతి పెద్ద డివిజన్ మైలార్ దేవులపల్లి 79 వేల 290 మంది ఓటర్లు ఉన్నారు. అతి చిన్న డివిజన్ రామచంద్రాపురం 27 వేల 948 మంది ఓటర్లు ఉన్నారు.