తిరుపతి ఎగ్జిట్ పోల్స్.. ఆ పార్టీదే హవా

-

తిరుపతి ఉప ఎన్నిక అంటే అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోనూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికలు బీజేపీ బలం, జనసేన ఉనికి, టీడీపీ పరువు, వైసీపీ ప్రతిష్ట అన్న మాదిరిగా నడిచాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికలను ప్రతి పార్టీ సవాల్ గా తీసుకున్నాయి. స్టార్ క్యాంపెయినర్లతో హెరెత్తించాయి. ఎలాగైనా గెలిచి ఏపీలోపాగా వేయాలని బీజేపీ, ఎక్కడ తమ పరువు పోతుందో అని టీడీపీ బలంగా ప్రచారం చేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిందే అన్న మాదిరిగా ప్రచారం సాగించాయి.

ఇక పోలింగ్ ముగిశాక ఎన్ని ట్విస్టులు జరిగాయో అందరికీ తెలిసిందే. వైసీపీ దొంగ ఓట్లు వేయించారని, ఫలితాలను ఆపేయాలంటూ బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ కోర్టుకెక్కారు. ఆ వెంటనే టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కూడా హై కోర్టులో పిటిషన్ వేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారు. ప్రజలను అధికారులు, వార్డు వలంటీర్లు బెదిరించారని పిటిషన్ దాఖలు చేశారు. వీరిద్దరి వాదన విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది.

ఇదిలా ఉండగానే.. దేశ వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. తిరుపతిలో కూడా ఆరా సంస్థ తమ ఫలితాలను రిలీజ్ చేసింది. తిరుపతిలో ఫ్యాను గాలే వీస్తుందని చెప్పింది. ఈ సంస్థ ప్రకారం.. వైఈసీపీకి 65.85 శాతం ఓట్లు, టీడీపీకి 23.10 శాతం ఓట్లు, బీజేపీకి 7.34 శాతం, ఇతరులకు 3.71 శాతం ఓట్లు వచ్చినట్లు అంచనా వేసింది. కానీ కోర్టు ఎవరివైపు తీర్పు ఇస్తుందో.. దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. వైసీపీకి అనుకూలంగా వస్తే ఆ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news