మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడే టీఆర్ఎస్ తొలి విజయం…!

-

తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో అధికార తెరాస పార్టీ బోణీ కొట్టింది. ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే విజయం సాధించి విపక్షాలకు చుక్కలు చూపించాలని భావిస్తున్న ఈ పార్టీ నామినేషన్ ప్రక్రియలోనే తొలి విజయాన్ని నమోదు చేసింది. మంచిర్యాల జిల్లా లంపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు(జనరల్)లో టీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అక్కడి నుంచి ఎవరూ పోటీలో లేకపోవడంతో,

ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉంటే నామినేషన్ ప్రక్రియ నేటి తో ముగిసిన సంగతి తెలిసిందే. ఒక్క కరీంనగర్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 9 కార్పొరేషన్లలోని 325 కార్పొరేటర్, 120 మున్సిపాలిటీల్లోని 2,727 కౌన్సిలర్ స్థానాలకు జనవరి 22న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. శనివారం ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించి, తిరస్కరరణకు గురైన వాటిని ప్రకటిస్తారు.

జనవరి 12, 13 తేదీల్లో తిరస్కరణకు గురైన నామినేషనన్లపై మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు. జనవరి 14 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. జనవరి 22న పోలింగ్ జరగనుండగా.. జనవరి 25న ఫలితాలను ప్రకటిస్తారు. ఒక్క కరీంనగర్‌ కార్పొరేషన్ పరిధిలో మాత్రం 24న పోలింగ్ జరుగుతుంది. 27న ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే విజయం సాధించాలని అన్ని పార్టీలు పట్టుదలగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news