తెలంగాణ డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ ఎన్నిక ఏకగ్రీవం..

-

తెలంగాణ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనుకున్న విధంగానే ఏకగ్రీవమయింది. డిప్యూటీ స్పీకర్‌గా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం నామినేషన్ల గడువు గత శనివారంతో ముగిసింది. అయితే.. నామినేషన్లు ముగిసే సమయానికి పద్మారావు గౌడ్ మాత్రమే నామినేషన్ వేశారు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది.

అయితే.. డిప్యూటీ స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేయడం కోసం టీఆర్‌ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిపక్ష సభ్యులతో మాట్లాడారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు డిప్యూటీ స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సమ్మతించారు. దీంతో ఇవాళ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు గౌడ్ ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించారు. సీఎం కేసీఆర్, ప్రతిపక్ష సభ్యులు పద్మారావు గౌడ్‌ను తీసుకెళ్లి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు.

పద్మారావుగౌడ్ రాజకీయ ప్రస్థానం

రాజకీయాల్లోకి రాకముందు పద్మారావుగౌడ్ రెండుస్లారు కార్పొరేటర్‌గా పనిచేశారు. తర్వాత 2001లో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 2004లో సికింద్రాబాద్ నుంచి టీఆర్‌ఎస్ తరుపున పోటీ చేసి గెలిచారు. తర్వాత 2009 లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2018లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో గెలిచిన తర్వాత కేబినేట్‌లో ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version