ట్రంప్, మోడీ మీడియా సమావేశం హైలెట్స్…!

-

భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య చర్చలు ముగిసాయి. ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. అనంతరం ఇరువురు అధినేతలు ఉమ్మడి మీడియా సమావేశ౦ నిర్వహించారు. తొలుత మాట్లాడిన మోడీ, ఇరు దేశాల మధ్య స్నేహ బంధం మరింత బలపడింది అన్నారు. భారత్ అమెరికాల మధ్య స్నేహ బంధానికి ప్రభుత్వాలకు సంబంధం లేదని అన్నారు.

21 వ శతాబ్దానికి భారత్ అమెరికా స్నేహం ఎంతో ముఖ్యమైంది అన్నారు మోడీ. ట్రంప్ తో తనకు ఇది 8 వ భేటి అన్నారు. గత 8 నెలల్లో 5 సార్లు ట్రంప్ తో భేటి అయ్యామని అన్నారు. రక్షణ, వాణిజ్య రంగాలకు సంబంధించి చర్చలు జరిపామని అన్నారు. ఇంధన సహకారం గురించి ప్రత్యేకంగా చర్చించామని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల గురించి పరస్పర సహకారం ఉంటుంది అన్నారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగుతాయని అన్నారు.

ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధం చాలా కీలకమైంది అన్నారు. ఉగ్రవాద శక్తులకు ప్రోత్సాహం అందించే వారిపై ప్రత్యేకంగా పోరాడతామని అన్నారు. నమస్తే ట్రంప్ కార్యక్రమం ఎప్పటికి గుర్తుండిపోతుంది అన్నారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేస్తామని మోడీ వ్యాఖ్యానించారు. సమాన అవకాశాలతో స్వేచ్చాయిత వాణిజ్యంపై చర్చించాం అన్నారు. ట్రంప్ కుటుంబ సమేతంగా రావడం ఎంతో సంతోషం అన్నారు.

మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల గురించి ఉమడిగా ముందుకి వెళ్తామని అన్నారు. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయని అన్నారు. భారత అమెరికా మధ్య స్నేహానికి పరిమితులు లేవని అన్నారు. అనంతరం మాట్లాడిన మోడీ, ఉగ్రవాదంపై కలిసి పోరాడుతాం అన్నారు. ఇస్లాం ఉగ్రవాదాన్ని అణిచి వేస్తామని అన్నారు. రెండు దేశాలకు ఉపయోగకరమైన పర్యటన ఇది అన్నారు.

మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది అన్నారు. సహజ వాయు రంగంలో ఒప్పందం చేసుకున్నామని అన్నారు. ఇండియా తో తమకు ప్రత్యేక అనుమబంధం ఉందని అన్నారు. తాను అధ్యక్షుడు అయిన తర్వాత భారత్ తో ఆర్ధిక బంధం బాగా బలపడింది అన్నారు. ఇరు దేశాల మధ్య 2.3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం జరిగింది అన్నారు. భారత్ తో ఆర్ధిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news