టీ అమ్మి మోడీపైకి వచ్చారు, ఆకట్టుకున్న ట్రంప్ ప్రసంగం…!

-

నమస్తే అంటూ ట్రంప్ ప్రసంగం ప్రారంభించారు. అద్భుతమైన ఆతిధ్యానికి ధన్యవాదాలు అన్నారు. మా హృదయంలో భారత్ కి ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. గత ఏడాది అద్భుతమైన మెజారిటి తో మోడీ గెలిచారని ట్రంప్ అన్నారు. ఎప్పటికి తమకు గుర్తుంచుకునే ఆతిధ్యం ఇచ్చారని అన్నారు. ఇండియా కు రావడం గర్వంగా భావిస్తున్నా అన్నారు ట్రంప్.

తనను ఇక్కడికి ఆహ్వానించిన మోడికి ధన్యవాదాలు చెప్పారు. అమెరికా భారత్ ని ఎప్పుడు ప్రేమిస్తుంది అన్నారు. 1.20 లక్షల మందిని ఒక్కసారే చూడటం గర్వంగా ఉందన్నారు. మోడీ గుజరాత్ కే కాదు దేశానికే గర్వకారణం అన్నారు. మోడీ టీ అమ్మే స్థాయి నుంచి పైకి వచ్చారని అన్నారు. యువకుడిగా ఉన్నప్పుడు మోడీ టీ షాపులో పని చేసారని అన్నారు.

మోడీ నా ఫ్రెండ్ అని చెప్పడానికి గర్వంగా భావిస్తున్నారు. అభివృద్ధి కోసం మోడీ కష్టపడుతున్నారని అన్నారు. భూ ప్రపంచం మీద మోడీ గొప్ప నేత అన్నారు. ప్రపంచంలోనే మధ్య తరగతి ప్రజల కేంద్రంగా భారత్ మారుతుంది అన్నారు. భారతీయులు ఏదైనా సాధించగలరు అనడానికి మోదినే ఉదాహరణ అన్నారు. 8 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి తాము ఇక్కడికి వచ్చామని అన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి తమను ఆహ్వానించారని అన్నారు ట్రంప్. బాలీవుడ్ గొప్ప సినిమాలు తీస్తుంది అన్నారు. ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్లను భారత్ అందించింది అన్న ట్రంప్, సచిన్, విరాట్ కోహ్లీ పేర్లను ప్రస్తావించారు. భారత ఐఖ్యత ప్రపంచానికే ఆదర్శం అన్న ట్రంప్, భారత్ లో అన్ని మతాల వారు ఉన్నారని ట్రంప్ కొనియాడారు.

ఈ సందర్భంగా దీపావళి, హోలీ పండగలను ట్రంప్ ప్రస్తావించారు. భారత ప్రజలు చాలా హుందాగా ఉంటారని అన్నారు ట్రంప్. మోడీ కఠినంగా ఆయన్ను అందరూ ప్రేమిస్తారని అన్నారు. దిల్ వాలే దుల్హానియా, షోలే చిత్రాలు చాలా గొప్పవి అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతీయులు కనిపిస్తారని అన్నారు ట్రంప్. భారత్ ఆర్మీ అత్యంత శక్తివంతమైనది అన్నారు ట్రంప్.

Read more RELATED
Recommended to you

Latest news