ఉండవల్లి ఇచ్చిన ఆ ఒక్క సలహా జగన్ వినడు గాక వినడు .. వింటే మాత్రం మామూలుగా ఉండదు !

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విభజన జరగక ముందు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్. ఏపీ రాజకీయాల గురించి బాగా తెలిసిన వాళ్లకి ఉండవల్లి పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. వైయస్ హయాంలో ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ నుంచి గల్లీ రాజకీయాల వరకు ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతి విషయాన్ని క్షుణ్నంగా కూలంకుషంగా వివరించడంలో ఉండవల్లి అరుణ్ కుమార్ దిట్ట. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్రాన్ని విభజించడం జరిగిందో అప్పటినుండి రెగ్యులర్ పాలిటిక్స్ నుండి తప్పుకోవడం జరిగింది. అడపాదడపా మీడియా సమావేశాలు పెడుతూ కీలక సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి విశ్లేషించే ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా జగన్ పరిపాలన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. Image result for undavalli arun kumar jagan

ముఖ్యంగా వైయస్ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటారు ఉండవల్లి అందువల్ల జగన్ ని పెద్దగా విమర్శించారు చంద్రబాబునే విమర్శిస్తారు అన్నా అపవాదు ఉంది. ఇలాంటి సమయంలో జగన్ పరిపాలన పై తీవ్రమైన విమర్శలు చేయడంతో పాటు ఒక సలహా కూడా ఇచ్చారు. క్షుణ్నంగా విషయంలోకి వెళ్తే జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్రంలో పెద్ద సమస్యగా మారిందని ఉండవల్లి అన్నారు. అయితే ఈ విషయాలను గట్టిగా ప్రసారం చేస్తున్న రెండు ఛానల్ నీ జగన్ సర్కార్ నిలిపివేయడాని ఉండవల్లి తప్పుబట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో కూడా అతనికి మీడియా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండేదని అయితే ఏనాడూ కూడా చానల్స్ పై నిషేధం వంటివి చేయలేదని అన్నారు.

 

అయితే జగన్ చేస్తున్న పనులు మంచిది కాదు అని తాను ప్రజలను నమ్మితే ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదని… మీడియాకి భయపడిన సమయం నుంచి ప్రజలలో తప్పు అపవాదు ప్రభుత్వంపై పడుతుందని దయచేసి మీడియా కి ఉన్న స్వేచ్ఛని వదిలేయాలని జగన్ కి ఉండవల్లి సలహా ఇవ్వటం జరిగింది. దీంతో నిజంగా జగన్ చేసే పని కరెక్ట్ అయితే మీడియా ఎంత వ్యతిరేకత చూపించిన ప్రజలు డైవర్ట్ అవ్వరు కాబట్టి ఉండవల్లి మాట వింటే చేస్తున్న మీడియా ఛానల్ దుష్ప్రచారం కూడా ప్రజల ముందు సన్నగిల్లి పోతుందని.., నైతికంగా కూడా తిరుగుండదు రాజకీయాల్లో అంటూ కొంతమంది పార్టీలో ఉన్న వారే లోలోపల మాట్లాడుకుంటున్నారు. అయితే మరోపక్క వైసీపీకి బలంగా ఉండే క్యాడర్ మాత్రం అటువంటి చానల్స్ జర్నలిజంలో ఉండకూడదు అని కామెంట్ చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news