రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్న నేపద్యంలో లాక్ డౌన్ ని కొనసాగించడానికే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపించారు. ఏ మాత్రం లైట్ తీసుకున్నా సరే వేలాది మంది ప్రాణాలు పోతాయని లాక్ డౌన్ కావాల్సిందే అని కేంద్రాన్ని ఆయన నేరుగా కోరారు. దీనిపై కేంద్రం స్పందించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలు అందరూ ఒక్కసారిగా బయటకు వస్తే ఇబ్బందులు వస్తాయని ఆయన హెచ్చరికలు చేసారు.
ఏ మాత్రం సహించవద్దు అని ఆయన పేర్కొన్నారు. దీనితో కేసీఆర్ సలహాలను తీసుకోవాలని కేంద్ర మంత్రులు భావిస్తున్నారు. లాక్ డౌన్ విషయంలో ఎం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని… ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర మంత్రులు. ఎన్ని రోజులు దీన్ని కొనసాగిస్తే బాగుంటుంది… దక్షినాది రాష్ట్రాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి… అనే విషయాలను ఆయన్ను అడిగి తెలుసుకోవాలని చూస్తున్నారు.
ఏదైనా సమస్య వచ్చిన సమయంలో కేసీఆర్ దాని మీద పూర్తి అవగాహనతో ఉంటారు. అందుకే ఆయన్ను అడిగి సలహాలు తీసుకోవాలని భావిస్తున్నారు. అలాగే తెలంగాణా పరిస్థితుల మీద ఆయన నుంచి పూర్తి నివేదిక తీసుకోవాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా లాక్ డౌన్ అడగలేదు. ఇప్పుడు కేసీఆర్ అడిగిన తర్వాత ఇతర రాష్ట్రాలు ముందుకి వచ్చి కేంద్రాన్ని కోరుతున్నాయి.