ఉత్తమ్ నోట కేటీఆర్ పాట….! షాక్ తిన్న కాంగ్రెస్ నేతలు..!

uttamkumar reddy and ktr showering praises on each other
uttamkumar reddy and ktr showering praises on each other

వీరిద్దరి మధ్య నిప్పు వేస్తే బగ్గు మనెంత వైరం ఉంది. ఒకరు టీపీసీసీ ప్రెసిడెంట్ మరొకరు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..! నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు కేటీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లు. కానీ నేడు ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లు కురిపించుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు కాంగ్రెస్ వర్గాలు నేతలు అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. హుజూర్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమం జరిగింది. దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటీఆర్ లు ఇద్దరు హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదేళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తమ్ కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ కేటీఆర్ ఓ డైనమిక్ లీడర్ తండ్రి పేరు ను నిలబెడుతున్నాడు అంటూ కితాబునిచ్చారు. ఇలా ఇద్దరు ఒకరి పై ప్రశంసలు చేసేసరికి అక్కడున్న వారంతా అవాక్కయారు. ఉత్తమ్ ప్రశంసలతో ఆ కేటీఆర్ కౌంటర్ ప్రశంసలతో ఆ ప్రాంతమంతా చప్పట్లతో మారుమోగింది.