ఆయన తిట్టేది, కొట్టేది అభిమానులు, కార్యకర్తలపై ప్రేమతోనే అని చెప్పుకొచ్చారు బాలకృష్ణ భార్య వసుంధర.
నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో వ్యవహరిస్తున్న తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి.. కార్యకర్తలతో దురుసుగా మాట్లాడటం, ఫ్యాన్స్‌ని కొట్టడం బాలకృష్ణకు అలవాటుగా మారిపోయింది. మొన్న జర్నలిస్టులను నరుకుతానంటే, నిన్న చీపురుపల్లిలో కార్యకర్తను పరిగెత్తించి మరీ కొట్టాడు. బాలయ్య ధోరణి పార్టీకి నష్టం కలుగజేస్తుందని టీడీపీ పార్టీ నేతలే భయపడుతున్నారు. ఇలా అభిమానులను కొట్టడం, తిట్టడం పై నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర గారు స్పందించారు.
బాలయ్య తీరును వెనకేసుకొచ్చారు. ఆయన అభిమానులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని, కొట్టడం పెద్దవిషయం కాదంటూ లైట్ తీసుకున్నారామె. అంతా ఫ్యాన్స్ తప్పు అన్నట్లుగా మాట్లాడారు వసుంధర. అయినా బాలయ్యకు ఫ్యాన్ అంటే ప్రేమ ఎక్కువ అనీ, ఫ్యాన్స్ శృతిమించి వ్యవహరించినా.. తప్పుగా ప్రవర్తించినా ఆయనకు వెంటనే కోపం వచ్చేస్తుందన్నారు. ఆయన తిట్టేది, కొట్టేది అభిమానులు, కార్యకర్తలపై ప్రేమతోనే అని చెప్పుకొచ్చారు వసుంధర. క్రమశిక్షణ అంటే ఆయనకు ప్రాణమని, ఎవరైన అందునా తన అభిమానులు క్రమశిక్షణతో లేకుంటే కొట్టేస్తారని వివరించారు. అభిమానులతో ఉన్న చనువు.. నా వాళ్లు అనే భావనతోను బాలయ్య అలా వ్యవహరిస్తుంటారని.. ఇది పెద్ద విషయం కాదన్నారు.
తన భర్త అంటే పడని వారే ఇలాంటి చిన్న విషయాలను రాజకీయం చేస్తున్నారని, ఫ్యాన్ మాత్రం అలా ఎమీ అనుకోరని తెలిపారు. ఆయన అభిమానులకు ఇవన్నీ అలవాటేనని, అనవసరంగా ఇలాంటి విషయాలను హైలైట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కష్టాల్లో ఉంటే బాలకృష్ణ తట్టుకోలేరన్నారని.. అందుకే ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందేలా చూస్తారని తెలిపారు.
భర్తను వెనుకేసుకు రావడం వసుంధర ధర్మం.. ఎందుకంటే ధర్మపత్ని కదా.. ప్రేమ ఉంది కాబట్టి కొట్టేస్తున్నారా..