విశాఖలో విమానాలు వద్దా ? రెడ్డి గారి లేఖపై రచ్చ రచ్చ ?

-

విశాఖను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ వస్తోంది. విశాఖను పరిపాలన రాజధాని చేసేందుకు జగన్ ఫిక్స్ అవ్వడం, కోర్టు ఇబ్బందులు తొలగిపోగానే పూర్తిస్థాయిలో విశాఖను రాజధానిగా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. విశాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని, అమరావతిలోనే రాజధాని ఉండాలని తెలుగుదేశం పార్టీ హడావుడి చేస్తున్నా, వైసీపీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఏదో రకంగా విశాఖను ప్రమోట్ చేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ఈ స్థాయిలో ముందుకు వెళుతున్న సమయంలో, ఓ సంచలన వార్త వైసిపి తో పాటు విశాఖ ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. అదేంటి అంటే విశాఖ లో ఉన్న ఎయిర్ పోర్ట్ ను మూసివేయాలని కేంద్రానికి వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి లేఖ రాశారని , ఆ లేఖను స్వయంగా కేంద్ర మంత్రి బయట పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో విశాఖలో ఎయిర్ పోర్ట్ మూసివేయాలని విజయసాయి రెడ్డి లేఖ ఎలా రాస్తారని ? అసలు ఆయనకు సంబంధం ఏమిటి అంటూ పెద్ద దుమారమే రేగుతోంది.

వారం రోజుల క్రితం కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ని విజయసాయిరెడ్డి కలిసారు. ఈ సందర్భంగా భోగాపురం ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపినట్టు సోషల్ మీడియా ద్వారా విజయసాయిరెడ్డి ప్రకటించుకున్నారు. కానీ అసలు విషయం వేరే ఉంది అనే విషయం కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి బయట పెట్టడం ఇప్పుడు ఈ దుమారం రేగడానికి కారణంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ లేఖలో ఏమి ఉంది అంటే ? విశాఖ ఎయిర్ పోర్ట్ ను 30 ఏళ్ల పాటు మూసివేయాలని విజయసాయిరెడ్డి కోరినట్లుగా సోషల్ మీడియాలో కేంద్రమంత్రి బయటపెట్టారట.అసలు విజయసాయిరెడ్డి ఈ విధంగా చేయడానికి ఒక కారణం ఉన్నట్లుగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధి చెందాలంటే , విశాఖ ఎయిర్ పోర్ట్ ఉండకూడదని , అప్పుడే అక్కడ అభివృద్ధి జరుగుతుంది అనేది ఆయన అభిప్రాయం గా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఇప్పటి వరకు భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన జరగకపోయినా, విజయసాయిరెడ్డి అప్పుడే ఈ విధంగా వినతి పత్రాలు ఇవ్వడం వెనుక కారణాలు కూడా ఉన్నాయట.గత టీడీపీ ప్రభుత్వం లోని భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మించాలని చూడడం, జిఎంఆర్ సంస్థ కు ఆ కాంట్రాక్టు ఇవ్వడం వంటి ఎన్నో వ్యవహారాలు జరిగాయి. అయితే ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వైసిపి అప్పట్లో ఆరోపించింది. అంతేకాదు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కాంట్రాక్టును రద్దు చేసింది. జీఎంఆర్ కు అప్పగించింది. 500 ఎకరాలు వెనక్కి తీసుకుంది. అయితే మళ్లీ అదే సంస్థకు కాంట్రాక్టు ఇచ్చి, భోగాపురం లోనే ఎయిర్ పోర్ట్ అభివృద్ధి చెందేలా , విశాఖ ఎయిర్ పోర్ట్ ను మూసి వేసే విధంగా హామీ ఇచ్చినట్లుగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పై పెద్ద దుమారమే పెరగడంతోపాటు , విజయసాయిరెడ్డి విశాఖ వాసులతో పాటు ప్రతిపక్షాలకు టార్గెట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version