విశాఖకు వెళ్ళిపోతున్న శాఖలు ఇవే, ముందుగా ఎన్ని అంటే…!

-

ఏపీ కొత్త పరిపాలన రాజధానిగా విశాఖపట్నంని ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అక్కడ అన్ని శాఖల కార్యాకలాపాలను మొదలు పెట్టె యోచనలో ఉంది. అయితే రాజకీయ పరంగా ఇబ్బందులు వస్తున్నా సరే ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గే అవకాశం కనపడటం లేదు. ఈ నెల 8 న కేబినేట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఈ నేపధ్యంలో విశాఖకు కీలక శాఖలను తరలించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. విశాఖలోని మిలీనియం టవర్స్‌లో కొత్త సచివాలయం ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 20వ తేదీ నుంచే విశాఖలోని మిలీనియం టవర్స్‌లో కొత్త సచివాలయానికి శాఖల తరలింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైనట్టు తెలుస్తుంది.

దశల వారీగా తరలింపు మొదలుపెట్టే యోచనలో ఉన్న ప్రభుత్వం ప్రాధాన్యత శాఖల్లో కీలక విభాగాలను ఆన్ డ్యూటీ కింద తరలించాలని భావిస్తుంది. జీఏడీ నుంచి మూడు సెక్షన్లు, ఫెనాన్స్ శాఖ నుంచి రెండు సెక్షన్లు, మైనింగ్ నుంచి రెండు సెక్షన్లు, హోంశాఖ నుంచి నాలుగు సెక్షన్లు, రోడ్లు భవనాల నుంచి నాలుగు సెక్షన్లు తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా పంచాయతీరాజ్ నుంచి నాలుగు సెక్షన్లు, వైద్య ఆరోగ్య శాఖ, ఉన్నత విద్య, పాఠశాల విద్యాశాఖ నుంచి రెండేసి సెక్షన్లు తరలించనుంది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news