ఆస‌క్తిక‌రంగా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక‌… నేడు ఏం జ‌రుగ‌బోతోంది…?

-

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక‌పై కూటమి నేతల కసరత్తు కొన‌సాగుతోంది.వైసీపీ త‌ర‌పున‌ బొత్సాను అభ్య‌ర్ధిగా ఖరారు చేసిన తరువాత బెంగళూరు కేంద్రంగా క్యాంపు ఏర్పాటు చేసారు. జిల్లా నేతలతో జగన్ వరుస సమావేశాలు నిర్వ‌హించి ఎన్నిక‌కు ప‌మాయ‌త్తం చేశారు. ఓటర్లను కాపాడుకుంటే గెలుపు తమదేనన‌న్న భావ‌న‌లో వైసీపీ నేత‌లు ఉన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మొత్తం 839 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీకి దాదాపుగా 600 ఓట్ల బ‌లం ఉంది.

టీడీపీకి 200 పైగా ఓట్లు ఉన్నట్లు లెక్కలు వారు చెప్పుకుంటున్నారు. ఏ పార్టీ గెలవాలన్నా 450 ఓట్లు అవసరం.మ‌రో 250 ఓట్లు వ‌స్తే కానీ టీడీపీకి గెలుపు అవ‌కాశాలు దాదాపుగా లేన‌ట్లే. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. టీడీపీ కూటమి నుంచి పీలా గోవిందు పేరు ఖరారైందనే ప్రచారం సాగినా ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు.ఇదే క్ర‌మంలో గండి బాబ్జీ గురించి కూడా చ‌ర్చ జ‌రిగింది. అయితే ఎవ‌రూ ఊహించ‌న‌టువంటి భైరా దిలీప్ పేరు రేసులోకి వచ్చింది.ఒక‌వేళ‌ టీడీపీ పోటీ చేయాలనే నిర్ణయానికి వస్తే దిలీప్ పేరును నేడు ప్రకటించే అవకాశం ఉంది.

వైసీపీ ఇప్పటికే బెంగ‌ళూరులో క్యాంపు ఏర్పాటు చేయటంతో ఆ పార్టీకి చెందిన ఓటర్లు ఏ స్థాయిలో కూటమి వైపు నిలుస్తారనేది కీలకంగా మారుతోంది.వైసీపీ అభ్య‌ర్థి బొత్స మాత్రం పూర్తిగా ఓటర్లతో మంతనాలు కొనసాగిస్తున్నారు. దీంతో..నేడు చోటు చేసుకొనే పరిణామాలతో ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం పైన స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్సా సత్యానారాయణ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Ap Mlc Elections,ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. 16న కౌంటింగ్! - mlc elections polling ends in andhra pradesh - Samayam Telugu

టీడీపీ కూటమి నుంచి ఇంకా పోటీ పైన సందిగ్ధత కొనసాగుతోంది. కూటమి నేతల్లోనే పోటీ పైన భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.టీడీపీ అభ్య‌ర్ధి గెలుపున‌కు అవసరమైన ఓటర్ల మద్దతు కూడ‌గ‌ట్ట‌గ‌ల‌మ‌ని కొందరు కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప‌లుమార్లు చంద్రబాబు వద్ద సమీక్షలు జ‌రిగాయి.అయినా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం లేదు టీడీపీ అధినేత‌.

మొత్తానికి విశాఖ ఎమ్మెల్సీ ఉప‌ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. హైద్రాబాదు నుంచి నేడు చంద్ర‌బాబునాయుడు విజ‌య‌వాడ‌కు రానున్నారు.దీంతో ఈ రోజు విశాఖ ఎన్నిక పైన కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది.నామినేష‌న్ వేసేందుకు అటు బొత్స సిద్ధ‌మైపోయారు. రోజురోజుకీ తిరుగుతున్న మ‌లుపుల‌తో విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక మొన్న ముగిసిన‌ అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల్లో వైసీపీకి మెజార్టీ ఓట్లు ఉన్నాయి. కూటమికి ఉన్న ఓట్ల సంఖ్య గెలిచేందుకు సరిపోదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గ్రేటర్ విశాఖ కార్పోరేటర్లతో పాటుగా పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు కూటమికి మద్దతుగా నిలిచారు. చంద్రబాబు వద్ద ఈ లెక్కలు ఉన్న‌ప్ప‌టికీ గెలుపుపైనే సందిగ్ధ‌త కొన‌సాగుతోంది.అందుకే అభ్య‌ర్ధి ప్ర‌క‌ట‌న ఆల‌స్య‌మ‌వుతోంది.రేప‌టితో నామినేష‌న్ ముగియ‌నున్న నేప‌థ్యంలో ఇవాళ అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.ఫైన‌ల్‌గా చంద్ర‌బాబు ప్ర‌క‌టించే నిర్ణ‌యంపై ఉత్కంఠ కొన‌సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news