దేశం మొత్తం గర్వించే వ్యక్తి కే‌సి‌ఆర్ ని కలవడానికి వస్తున్నాడు !!

-

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ తర్వాత వరుసగా రెండు ఎన్నికలలో ముఖ్యమంత్రి అయి తెలంగాణ ప్రజల కల సాకారం అయ్యే విధంగా పరిపాలన అందిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తాగు మరియు సాగు నీటి కష్టాలను తీర్చే విధంగా కేసీఆర్ తనదైన శైలిలో తీసుకున్న నిర్ణయాలకు దేశంలోనే మహామహులకు పులకరించే విధంగా మారాయి. మేటర్ లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో కనీసం నీళ్లు కనిపించే ప్రాంతాలు కూడా చాలా తక్కువ. అటువంటి తెలంగాణ ప్రాంతంలో కాలేశ్వరం ప్రాజెక్టు చేపట్టి యుద్ధప్రాతిపదికన కెసిఆర్ ప్రాజెక్ట్ పూర్తి చేశారు.Mission Kakatiya can do wonders, says Watermanదీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు కాలేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అంటూ…గోదావరి నీటితో ప్రాజెక్ట్ జలకళ ఆడటంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. నీళ్ళు నిల్వ ఉండేలా దాదాపు కిలోమీటర్ల మేర నీటి నిల్వ ఉండటంతో ఈ ప్రాజెక్టు చూస్తున్న చాలామంది కెసిఆర్ ప్లానింగ్ కు ఫిదా అవుతున్నారు. సామాన్యులతో పాటు అసమాన్యుల నీ సైతం ప్రభావితం చేస్తోంది కాలేశ్వరం ప్రాజెక్ట్. ఇటువంటి నేపథ్యంలో దేశం మొత్తం గర్వించే వ్యక్తి అయినా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా సుపరిచితుడైన రాజేందర్ సింగ్ తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు ను సందర్శించారు.

 

గోదావరి నీటితో కళకళలాడుతున్న కాలేశ్వరం ప్రాజెక్టు చూసి ఫిదా అయ్యారు. కెసిఆర్ పనితనాన్ని మరియు ప్రాజెక్టు పరిధిలో మేడిగడ్డ ఆనకట్ట.. లక్ష్మీ పంప్ హౌస్.. ఎత్తి పోతల పనులను పరిశీలించి ఇంజనీర్లను పొగిడారు. అయితే ఇంకా ఈ ప్రాజెక్టు పనులు గురించి తెలుసుకోవడానికి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా సుపరిచితుడైన రాజేందర్ సింగ్ కెసిఆర్ ని కలవటానికి ప్రగతి భవన్ కి రాబోతున్నాడని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news