‘రెడ్డి’ కులం లోకి మారిపోతామ్.. అమరావతి ‘కమ్మ’ రైతులు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల హడావిడి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. మాచర్ల లో జరిగిన ఘటన చూసి చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు ఎక్కడా కూడా తగ్గటం లేదు. సార్వత్రిక ఎన్నికలలో తగిలిన దెబ్బ స్థానిక సంస్థల ఎన్నికల్లో కోలుకోవాలని తెలుగు దేశం పార్టీ బాగా కష్టపడుతుంది. మరోపక్క అధికార పార్టీ వైసీపీ ఈ ఎన్నికలలో పూర్తిగా మెజార్టీ స్థానాలు గెలిపించి తెలుగుదేశం పార్టీ కి రాష్ట్రంలో భవిష్యత్ లేకుండా చేయాలని అనేక వ్యూహాలు పన్నుతోంది. Image result for ap dharnaఇటువంటి తరుణంలో అమరావతి గ్రామంలో గత కొన్ని రోజుల నుండి దీక్షలు చేస్తున్న రాజధాని రైతులు వెరైటీగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గానికి అనగా చంద్రబాబు వర్గానికి చెందిన వాళ్లే ఉండటంతో అమరావతిని చంద్రబాబు రాజధానిగా ప్రకటించడం జరిగిందని ఎప్పటినుండో వాదన వినబడుతోంది.

 

ఇటువంటి తరుణంలో రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు కేవలం కమ్మ సామాజిక వర్గం వారే కాదు ఇతర కులస్తులు కూడా ఉన్నారు అంటూ ప్లకార్డులు పట్టుకుని కావాలంటే మేమందరం ” ‘ రెడ్డి ‘ కులం లోకి మారిపోతామ్ … ” అంటూ ప్రకటన చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. దయచేసి రాజధాని కోసం భూములు త్యాగాలు చేసిన మా బ్రతుకు లతో ఆడుకోవద్దని సర్కార్ కి సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news