వాట్ నెక్స్ట్ నాగబాబు.. చలో జబర్దస్త్.. అంతేగా అంతేగా..!

-

మనం మాట్లాడుకునేది జబర్దస్త్ నాగబాబు గురించే. అవును.. ఆయన గురించే.. ఆయన తమ్ముడిని ప్రజలు తిరస్కరించారు. ఆయన్ను తిరస్కరించారు. ఘోరంగా అంటే ఘోరంగా తిరస్కరించారు.

ఏదో ఓ నెల రోజులు మనం చేసే పనులకు బ్రేక్ ఇచ్చి.. సడెన్ గా రాజకీయాల్లో చేరి.. ఎంపీగానో.. ఎమ్మెల్యేగానో పోటీ చేస్తే చాలు.. ప్రజలు ఓటేస్తారు.. మనల్ని గెలిపిస్తారు. గెలిచిన తర్వాత ఇక మనకు ఆ నియోజకవర్గంతో సంబంధం లేకుండా మన పని మనం చూసుకోవచ్చు. మళ్లీ ఐదేళ్ల దాకా గెలిపించిన ప్రజల వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు.. అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అంతే కదా. రాజకీయాలంటే పార్ట్ టైమ్ జాబ్సా ఏమన్నా. ఏదో కొన్ని రోజులు వచ్చి ఏదో చేసేసి తిరిగి వెళ్లిపోవడానికి. అదేమన్నా జాబా? ఎందరో మహామహులే రాజకీయాల్లో ఎన్నో దెబ్బలు తిన్నారు.

మనం మాట్లాడుకునేది జబర్దస్త్ నాగబాబు గురించే. అవును.. ఆయన గురించే.. ఆయన తమ్ముడిని ప్రజలు తిరస్కరించారు. ఆయన్ను తిరస్కరించారు. ఘోరంగా అంటే ఘోరంగా తిరస్కరించారు. నాగబాబు అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక.. సడెన్ గా జనసేనలో చేరి పార్టీ కండువా కప్పుకొని నరసాపురం ఎంపీగా నిలబడ్డాడు. పది పదిహేను రోజులు ప్రజలు చుట్టూ తిరిగి ప్రజలకు సేవ చేస్తామని చెప్పి.. వాళ్లను నమ్మించి ఓట్లు గుంజుకోవచ్చని అనుకున్నారు వీళ్లు. ఏకంగా ఎంపీనే అయిపోదామనుకున్నాడు నాగబాబు. కానీ.. సీన్ మొత్తం రివర్స్ అయింది. ప్రజలు నాగబాబును అడ్డంగా ఓడించారు.

ఇప్పుడు ఏం చేయాలి. ఉన్న ఒక్క జబర్దస్త్ షోను కూడా వదిలేసి వచ్చాడు నాగబాబు. ఇప్పుడు ఉన్న గత్యంతరం ఏంటి. ఇంకేముంది మళ్లీ ఆ జబర్దస్త్ షోనే దిక్కు. అంతేగా.. అంతేగా. అది తప్పించి ఇంకేముంది చేయడానికి. మరో ఐదేళ్ల దాకా ఆ జబర్దస్త్ షోతోనే కాలక్షేపం చేయు నాగబాబు. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి కదా అప్పుడు మళ్లీ ఎంపీగా పోటీ చేద్దువు కానీ.. అప్పటి వరకు ఖాళీగా ఉండటం ఎందుకు. ఏమంటారు.. అంతేగా.. అంతేగా..

Read more RELATED
Recommended to you

Exit mobile version