తాటికొండ రాజయ్య దారెటు… కాంగ్రెస్ వద్దనుకుందా..!

-

స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఏ పార్టీలోకి వెళ్లాలో అర్థంకాని స్థితిలో ఉన్నారు.గత నెల 3వ తేదీన బీఆర్ఎస్ కి ఆయన గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి దారులు మూసుకుపోయాయి.తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాక కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉంటూనే ఉన్నారు. పలుమార్లు రేవంత్ రెడ్డిని కలిశారు.అయినా పార్టీలో చేరికపై ఇంకా క్లారిటీ రాలేదు.అయితే తాటికొండ రాజయ్యను కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవద్దంటూ ఆ పార్టీ నేతలు రాష్ట్ర అధిష్టానానికి వినతి పాత్రలు ఇవ్వడంతోపాటు ఆందోళనలు చేయడం విశేషం.

రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరుతున్నాడని ప్రచారం జరుగుతుండగానే స్టేషన్గన్పూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ లోకి రాజయ్య ను తీసుకోవద్దని బహిరంగంగానే హెచ్చరించారు. అంతేకాకుండా రాజయ్య తన ప్రయత్నాలు చేస్తుండడంతో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన మహిళ నేతలు రాష్ట్ర కాంగ్రెస్ భవన్ ముందు నిరసన తెలిపి పార్టీ పెద్దలకు సైతం వినతి పత్రాన్ని అందజేసే వచ్చారు.ఇవేమీ పట్టించుకోని రాజయ్య తన ప్రయత్నాలను ఆపలేదు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా రాజయ్య కాంగ్రెస్ లో చేరడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో రాజయ్య తరచు కలవడాన్ని మహిళా నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన మనసు మారాలని మేడారం జాతరలో అమ్మవార్లకు పూజలు కూడా చేశారు. రాజయ్య ఎమ్మెల్యేగా ఉండగా మహిళలను ఇబ్బందులకు గురిచేశారని, అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ లో చేర్చుకుంటే పార్టీ అపవిత్రం అవుతుందని ఆవేదన చెంసుతున్నారు.ఇంత స్థాయిలో రాజయ్యపై వ్యతిరేకత వస్తున్నా ఆయన్ సీఎం తో టచ్లోనే ఉంటున్నారు.
ఓవైపు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు అధిష్టానం పై తెస్తున్న ఒత్తిడితో పాటు సీఎం నుంచి క్లారిటీ రాకపోవడంతో రాజయ్య దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news