ఇదేం రచ్చ గురూ…టీడీపీలో ఆ బ్లాక్‌షీప్స్ ఎవరు?

అసలే ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి మరీ ఘోరంగా ఉంది. ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన టి‌డి‌పి నిదానంగా ఆ ఓటమి నుంచి ఇప్పుడుప్పుడే బయటపడుతున్నట్లు కనిపిస్తోంది. టి‌డి‌పి అధినేత చంద్రబాబు పార్టీ డ్యామేజ్‌ని తగ్గించే పనిలో ఉన్నారు. కానీ సొంత నాయకులే పార్టీని ఇంకా డ్యామేజ్ చేసేలా కనిపిస్తున్నారు. టి‌డి‌పి సీనియర్ నాయకులు అనూహ్యంగా బయటకొచ్చి రచ్చ చేసేస్తున్నారు.

TDP Party | తెలుగుదేశం పార్టీ
TDP Party | తెలుగుదేశం పార్టీ

ఇప్పటికే బుచ్చయ్య చౌదరీ వ్యవహారం మొన్నటివరకు హల్చల్ చేసింది. కొందరు నాయకుల వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని బుచ్చయ్య ఓపెన్‌గా చెప్పేశారు. అలాగే తన మాటలని చంద్రబాబు గానీ, లోకేష్ గానీ పట్టించుకోవడం లేదని, కాబట్టి తాను పార్టీలో ఉండదలుచుకోలేదని హడావిడి చేశారు. అయితే బుచ్చయ్యకు చంద్రబాబు ఏదొకవిధంగా సర్ది చెప్పి, లైన్ చేశారు.

ఇక బుచ్చయ్య వ్యవహారం సద్దుమణుగుతుంది అనుకుంటే, తాజాగా జే‌సి‌ ప్రభాకర్ రెడ్డి రచ్చ స్టార్ట్ చేశారు. తాజాగా రాయలసీమ టి‌డి‌పి నేతలు, ఆ ప్రాంతంలోని నీటి ప్రాజెక్టులపై మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్‌కు వెళ్ళిన జే‌సి…కార్యకర్తలకు చెప్పకుండా ఈ మీటింగులు ఏంటని ఫైర్ అయ్యారు. అసలు కార్యకర్తలని ఎవరూ పట్టించుకోవడం లేదని, వారిని న్యాయం చేయడం లేదని, వైసీపీ వేధిస్తున్నా సరే వారికి అండగా ఉండటం లేదని ఫైర్ అయ్యారు.

అసలు అనంతపురం అంటే టి‌డి‌పికి కంచుకోట అని, కానీ ఇద్దరు నేతల వల్ల పార్టీ నష్టపోతుందని, త్వరలోనే వారి పేర్లు బయటపెడతానని అంటున్నారు. అయితే ప్రస్తుతం అనంతపురంలో టి‌డి‌పిలో లీడ్ తీసుకుంది…సీనియర్ నాయకుడు కాలువ శ్రీనివాసులు. ఆయన టార్గెట్‌గానే జే‌సి విమర్శలు చేశారని టి‌డి‌పి వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి జే‌సి అనుకున్నట్లుగా టి‌డి‌పిని నాశనం చేసే ఆ ఇద్దరు నాయకులు ఎవరో?