నిజామాబాద్ లో సెల్ఫీ సూసైడ్ క‌ల‌క‌లం..స్పీక‌ర్ కు రిక్వెస్ట్..!

నిజామాబాద్ జిల్లాలో సెల్ఫీ సూసైడ్ క‌ల‌క‌లం రేపుతోంది. కోటగిరిలో పత్తి సతీష్ అనే యువకుడు సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పని చేశాడని కక్ష బర్ల మధు, బర్ల భాను, తేళ్ల రవికుమార్ అనే వ్య‌క్తులు త‌న‌ను చంపేస్తామ‌ని బెదిరిస్తున్న‌ట్టు స‌తీష్ వీడియోలో చెబుతున్నాడు. పలుమార్లు దాడి చేశార‌ని, చంపేస్తామని బెదిరింపులకు పాల్ప‌డుతున్నార‌ని సతీష్ ఆరోపించాడు.

తాను ఈ విష‌యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జ‌ర‌గ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. తాను చనిపోతున్నానని, తన ఇద్దరు కూతుళ్లు, తల్లి బాద్యత తీసుకోవాలని స్పీకర్ పోచారం కు స‌తీష్ వీడియోలో విన్నవించుకున్నాడు. సెల్ఫీ వీడియోలో గోడు వెళ్లబోసుకుని ఆత్మహత్య యత్నం చేసిన పత్తి సతీష్ ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఆయ‌న బోధ‌న ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.