లాక్ డౌన్ వేసినా అంతమంది ఎందుకు చనిపోతున్నారు..!!

52

చైనా దేశం వ్యూహన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ భూమి మీద ఉన్న అన్ని ఖండాలలో వ్యాపించి ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు ఇటలీ మరియు అమెరికాలో ఈ వైరస్ విచ్చలవిడిగా విజృంభిస్తోంది. ఇటలీ దేశం లో అయితే కుప్పలుతెప్పలుగా మనుషులు చనిపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించక పోవడంతో నిర్లక్ష్యం వహించడంతో ఇటలీ దేశంలో వైరస్ ప్రభావం చాలా గట్టిగా ఉంది. ఇటీవల ఒక్క మంగళవారం రోజు దాదాపు ఏడు వందలకు పైగానే మరణాలు ఇటలీలో సంభవించడం జరిగింది. Image result for india lock downదీంతో అత్యంత వైరస్ ప్రభావం కలిగిన దేశంలో ఎక్కువ మరణాలు సంభవించిన దేశంగా ఇటలీ అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యింది. కాగా ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగానే ప్రజలు కరోనా భారిన పడగా, మృతి చెందిన వారి సంఖ్య 18260 కు చేరుకుంది. ఇండియాలో ఐదు వందల కేసులు కి పైగానే రిజిస్టర్ అయ్యాయి 10 మంది చనిపోవడం జరిగింది. దీంతో చాలామంది సోషల్ మీడియాలో ప్రజలు ఈ వార్తలు విని లాక్ డౌన్ వేసినా అంతమంది ఎందుకు చనిపోతున్నారు అంటూ కొంత మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో కొందరు నిపుణులు.. లాక్ డౌన్ లేటు గా వేశారు .. వీళ్ళంతా అంతకు ముందు రిజిస్టర్ ఐనా కేసులు .. నెమ్మదిగా చావులు తగ్గుతాయి అని జవాబిచ్చారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21 రోజులు లాక్ డౌన్ ప్రజలు పాటిస్తే, కచ్చితంగా వైరస్ నీ అరికట్టవచ్చు స్టేట్ హోమ్ అని సేవ్ కంట్రీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.