న‌మో రాజకీయం.. కేసీఆర్ దూరం దూరం

-

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్న భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీని సందర్శించి వ్యాక్సిన్ ప్రయోగాలు ఎక్కడి వరకు వచ్చాయో అన్న సంగతి తెలుసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్నారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకి ప్రధానమంత్రి వస్తున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం ఉంటుంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్వర్యంలోనే ఈ సందర్శన కార్యక్రమం జరగాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్ర రాజధానికి విచ్చేయుచున్న ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవడం లేదు. దీనికి చాలా కారణాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్. హైదరాబాద్ లో డిసెంబరు 1వ తేదీన గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపు కోసం రేసులో ఉన్న పార్టీలన్నీ ఒకరి మీద ఒకరు విమర్శర్లు గుప్పించుకుంటూనే ఉన్నారు.

మరీ ముఖ్యంగా బీజేపీ, టీఆర్ ఎస్ ల మధ్య విమర్శల ప్రవాహం ఎక్కువగా ఉంది. ఇలాంటి టైమ్ లో కేసీఆర్ ని ఆహ్వానిస్తే, జనాల్లోకి అది వేరే విధంగా వెళ్తుంది. పార్టీ కార్యకర్తల్లో కూడా ఒకరకమైన అసహనం ఏర్పడే అవకాశం ఉంది. అసలే టీఆర్ ఎస్ వర్గాలు తమ ప్రత్యర్థి బీజేపీ అని చెప్పుకున్నాయి. అందుకే ప్రత్యర్థిని పక్కన పెట్టుకోవడం సరికాదని మోదీ భావించారని అనుకుంటున్నారు.

ఇక మరో కారణం, కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద ఆసక్తి చూపించడమే. జాతీయ రాజకీయాల్లో మార్పు కోసం ప్రాంతీయ పార్టీలని ఏకం చేయాలని చూస్తున్న కేసీఆర్, బీజేపీకి ప్రత్యర్థిగా మారతాడని చెప్పాల్సిన అవసరం లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే మోదీ, కేసీఆర్ ని ఆహ్వానించలేదని చెప్పుకుంటున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గ్రేటర్ ఎన్నికలకి ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ రావడం, ఓట్లని తమ వైపుకు తిప్పుకునేందుకు చేసే చర్యలో భాగమే అనీ అందరికీ తెలిసిన సత్యం.

Read more RELATED
Recommended to you

Latest news