చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారా.. ?

-

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం ఉందా.. ఆయన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టించే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో వైఎస్ జగన్ ను అరెస్టు చేసిన సమయంలో అప్పట్లో ఉమ్మడి ఏపీలోని ఓ కాంగ్రెస్ నాయకుడు శంకర్ రావుతో ఫిర్యాదు చేయించారని చెబుతారు.

ఆ ఫిర్యాదు ఆధారంగానే జగన్ అక్రమాస్తుల కేసు, అధికార దుర్వినియోగం వంటి కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత టీడీపీ నుంచి ఎర్రన్నాయుడు కూడా కేసు పెట్టారు. ఫలితంగా జగన్ 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఇప్పుడు సేమ్ సీన్ గుర్తొస్తోంది. పోలీసుల ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బతీసేలా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత వర్ల రామయ్య మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఈమేరకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, వైయస్‌ఆర్‌సీపీ నాయకులు విడదల రజని, మహ్మద్ ముస్తఫా తదితరులు ఫిర్యాదు చేశారు. పోలీస్ వ్యవస్థను కించపరిచేలా వారు మాట్లాడుతున్నరని, డీజీపీ గౌతం సవాంగ్ పైనా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, వర్ల రామయ్యను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

అయితే ఇంత చిన్న ఆరోపణలపై అరెస్టు చేసే అవకాశం ఉండదు. కానీ చంద్రబాబు అవినీతిని నిరూపించేందుకు ఇప్పటికే అనేక కమిటీలను జగన్ నియమించి ఉన్నారు. వాటిలో ఏదో ఒక రిపోర్టు బలంగా దొరికితే చాలు.. చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు చంద్రబాబును అరెస్టు చేయకపోయినా.. ముందు ముందు ఆ అవకాశాలను తోసిపుచ్చలేమంటున్నారు విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Latest news