ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ హత్య కేసుపై జగన్ సర్కార్ సీరియస్..

-

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలలుగా జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయి. ఇక తాజాగా ఆంధ్రజ్యోతి తొండంగి అర్బన్ రిపోర్టర్ సత్యనారయణను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. అయితే తమకు ప్రాణహాని ఉందని ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ లు సత్యనారాయణ, కరుణలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా తుని రూరల్ ఎస్ఐ, శ్రీకాకుళం జిల్లా జులుమూరు ఇంచార్జ్ ఎస్ఐ, ఏఎస్ఐలను విధుల నుంచి తొలగించాలని డీజీపీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

సత్యనారాయణ హత్యకు గురికాగా, మరో జర్నలిస్ట్ కరుణ వీరుడుపై దాడి జరిగింది. వీరిపై గతంలోనే దాడి జరుగగా, అప్పుడు వీరు పోలీసులను ఆశ్రయించారు. వారు చేసిన ఫిర్యాదుపై స్థానిక పోలీసులు స్పందించ లేదని డీజీపీ విచారణలో తేలింది. అప్పుడే స్పందించి, విచారణ జరిపించి, బాధితులకు రక్షణ కల్పించాల్సిందని అభిప్రాయపడ్డ డీజీపీ, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై తక్షణ చర్యలకు ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news