ఉరి వేసుకుంటా అంటూ సవాల్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే…!

-

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తున్నాయి. హఫీజ్ ఖాన్ జిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరగడానికి కారణం అనేది కొందరి వాదన. టీడీపీ, బిజెపి కూడా ఎమ్మెల్యే గారిని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. దీనిపై ఆయన స్పందించారు. తనపై కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పై వస్తున్న ఆరోపణలకు ఆయన ఘాటుగా సమాధానం చెప్పారు.

వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వల్లే కర్నూలులో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందంటూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తన వల్ల, కర్నూలు ఎంపీ వల్ల కరోనా వ్యాపించిందని భూమా అఖిలప్రియ ఆరోపించారని… నీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండని ఆయన సవాల్ చేసారు. మీకే కాదు. ఎవరికైనా సరే… నాపై విచారణ వేస్తారా వేయండని… అధికారులపై వేస్తారా?, వేయండని ఛాలెంజ్ చేసారు.

మేం తప్పు చేసి ఉంటే, మా కర్నూలులో రాజుగారి సెంటర్ అని ఉందని… అక్కడ మమ్మల్ని ఉరితీయండని సవాల్ చేసారు. రెడీగా వెళ్తామని అన్నారు. అందరికన్నా ముందు మసీదులు బంద్ నేను చేయించా అని ఆయన అన్నారు. తబ్లిగీ జమాత్ నుంచి వచ్చిన వారి ఇంటింటికీ వెళ్లి వారికి, మతగురువులకి, సంస్థలకు చెప్పి 24 గంటల్లో వారిని క్వారంటైన్ కేంద్రాలకు తీసుకుని వెళ్లా అని హఫీజ్ ఖాన్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news