అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని భుజానికెత్తుకున్న వైసీపీ

-

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ 460 రోజులుగా ఉద్యమిస్తున్న రైతులను పట్టించుకున్నవారే లేరు. లాఠీల స్వైర విహారం.. బూట్ల చప్పుళ్లు ఇక్కడి గ్రామాల్లో నిత్యకృత్యమయ్యాయి. అమ్మవారి దర్శనానికి వెళుతున్నా అడ్డంకులే. . రాజధాని అంటే మనకు సంబంధించినది కాదు.. అక్కడి గ్రామాలకు సంబంధించినదేననుకుంటున్న రాష్ట్ర ప్రజలు ఒకవైపు..
అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రాభివృద్ధి కోసం మూడు రాజధనులంటూ ప్రకటన చేసి ఇక్కడినుంచి ఎంత త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్దామా అనే ప్రయత్నాల్లో ప్రభుత్వం మరోవైపు.. ఇటువంటి తరుణంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే భుజానికెత్తుకుంది.

మోయ‌కుండానే మోస్తున్న వైసీపీ

సీఆర్డీఏ చట్టం ప్రకారం.. రైతులతో చేసుకున్న ఒప్పందాలను ఆ తర్వాత ప్రభుత్వాలు గౌరవించాలి. రైతులకు ఇవ్వాల్సిన పింఛన్లు, నష్ట పరిహారం వంటివాటిని కూడా చెల్లించాలి. అసైన్డ్ భూముల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీకి ఫిర్యాదు చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధాని ఉద్యమానికి కొత్త ఊతం ఇచ్చారు. రైతులకు ఆయనే స్వయంగా కొత్త అస్త్రాలను అందించారు. ఎస్సీ, ఎస్టీ భూములను రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న స‌మ‌యంలో వారి హక్కులకు ఎలాంటి భంగం కలిగించకూడదని సీఆర్‌డీఏ చట్టంలో పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం రాజధానిలోని ఎస్సీ, ఎస్టీ రైతులపై ఎలాంటి వేధింపులకూ పాల్పడకూడదు. జగన్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం అడుగడుగునా.. వీరిపై వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.

ఎవ‌రు ఎవ‌ర్ని వేధిస్తున్నారు?

వాస్తవానికి సీఐడీ ముందు వాంగ్మూలం ఇచ్చిన అన్నదాతలు గత ప్రభుత్వం తమను వేధించలేదని చెప్పారు. కేసుల కోసం స్టేషన్లకు తిప్పుతూ దళిత రైతులను ఇప్పుడున్న వైసీపీ ప్రజాప్రతినిధులు ఎలా వేధిస్తున్నారోనన్న విషయం బయటపడింది. జాప్రతినిధులు ఎస్సీ, ఎస్టీలన వేధించకూడదని, ఇలా వేధించే గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల నుంచి భూములు దక్కించుకుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే లేవనెత్తిన విషయం ఆధారంగా వైసీపీ ప్రజాప్రతినిధుల పైన కేసు వేసే అవకాశం రైతులకు దొరికింది. మహిళలను వేధించడం, ఇంట్లో నుంచి బయటకు వస్తే కేసులు నమోదు చేయడం వంటివాటిని కోర్టులో సవాల్ చేసే అవకాశం వైసీపీ ప్రభుత్వమే కల్పించింది. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపించడమే లక్ష్యంగా ఉన్న వైసీపీ ప్రభుత్వం అదే క్రమంలో తనకు తెలియకుండానే అమ‌రావ‌తి ఉద్యమాన్నిభుజానికెత్తుకుంది. ఇదే చిత్రం.

Read more RELATED
Recommended to you

Exit mobile version