విజయవాడలోని స్వరాజ్ మైదానంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ అట్టహాసంగా జరిగింది.. బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం 400 కోట్ల రూపాయలు వెచ్చించారు.. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది దళితులు అంబేద్కర్ వాదులు వైఎస్ఆర్సిపి శ్రేణులు హాజరయ్యారు.. విజయవాడ నగరాలలో జన సునామీ కనిపించింది.. అయితే ఓ వర్గం మీడియా మాత్రం కళ్ళు ఉన్న కబోదిలా వ్యవహరించిందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి..
విగ్రహ ఆవిష్కరణ ప్రారంభోత్సవ తేదీని ప్రకటించినప్పటి నుంచి ఏబీఎన్, ఈనాడు టీవీ 5 వంటి ఎల్లో మీడియా వక్ర భాష్యానికి శ్రీకారం చుట్టాయి.. ప్రభుత్వం మీద బురద చల్లడం తో పాటు.. అంబేద్కర్ వాదుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య కథనాలను ప్రచురించాయి.. దళితులందరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళుతున్నారని వారికి కడుపు మండిందో ఏమో.. ప్రారంభోత్సవానికి ముందు రోజు ప్రారంభోత్సవం రోజు.. లోపాలను ఎత్తి చూపేలా వార్తలను ప్రచురించాయి..
సాయంత్రం వైయస్ జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని గ్రాండ్ గా లాంచ్ చేసే సమయంలో కూడా.. కనీసం లైవ్ కూడా టెలికాస్ట్ చేయలేని పైత్యంలో ఎల్లో మీడియా ఉందని దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అంబేద్కర్ అంటే ఓ వర్గానికో ఓ ప్రాంతానికో నాయకుడు కాదని.. రాజ్యాంగ నిర్మాతగా భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దే మహనీయులుగా ఎల్లో మీడియా గుర్తించలేకపోయిందని అంబేద్కర్ వాదులు మండిపడుతున్నారు.. అన్ని చానల్స్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ప్రారంభోత్సవం చేసి వెళ్లిపోయేదాకా లైవ్ ఇస్తే.. ఆ నాలుగు చానల్స్ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడం దళితులను అవమానించడమే అవుతుందని.. తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు..